BigTV English

Jeevan Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల రేసులో జీవన్ రెడ్డి.. రేవంత్ నిర్ణయం ఏంటి..?

Jeevan Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల రేసులో జీవన్ రెడ్డి.. రేవంత్ నిర్ణయం ఏంటి..?

Jeevan Reddy: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హాడవుడి కాంగ్రెస్‌లో మొదలైంది. ఆశావాహుల సంఖ్య కూడ రోజురోజుకి పెరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన‌ మనసులోని మాట బయటకి చెప్పారు. అధిష్టానం అదేశిస్తే పొటికి సై అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ ఎన్నికలపైనా ఫోకస్ పెట్టిన నేపధ్యంలో అభ్యర్థుల ఎంపికపై వాడివేడి చర్చ జరుగుతుంది.


ఉత్తర తెలంగాణలో కీలకమైన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి మొదటివారంలో జరిగే అవకాశం ఉంది. పార్లమెంటు ఎన్నికల తరువాత ఇది ముఖ్యమైన ఎన్నికగా చెప్పుకోవచ్చు. ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఉమ్మడి అదిలాబాదు, ‌కరీంనగర్, నిజామాబాదు, మెదక్ జిల్లాల్లో విస్తరించి ఉంది. 2019 ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి పొటీ చేసి విజయం సాధించారు.. అ సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ కారు టైరు పంచర్ చేయగలిగింది.

బీఅర్ఎస్ ని ఎదుర్కొని కాంగ్రెస్ విజయం సాధించిన జీవన్‌రెడ్డి ఉత్తర తెలంగాణ జిల్లాలలో కాంగ్రెస్ క్యాడర్ లో నూతన ఉత్సహాం నింపారు. 2023 అసెంబ్లీ ఎన్నికలో జగిత్యాల నుండి జీవన్ రెడ్డి పొటీ చేసి ఓడిపోయారు.. తరువాత అయన ప్రత్యర్థి ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు కాంగ్రెస్ కండువా కప్పడంతో జీవన్ రెడ్డి తన అసంతృప్తి ని బహిరంగంగానే వెళ్లగక్కారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్దమైన జీవన్‌రెడ్డిని రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు, హైకమాండ్ నేతలు బుజ్జగించాల్సి వచ్చింది.


ఇటివల తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్య నేపధ్యంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మరోసారి అధిష్టానం పై విమర్శలు గుప్పించారు..తరువాత ముఖ్యనేతలు‌ మాట్లాడిన కూడా వెనక్కి తగ్గలేదు. ఈ పరిణామాల కారణంగా జీవన్ రెడ్డి మరోసారి ఎమ్మెల్సీ గా పొటి చేయరని అందరూ భావించారు. కాని మరోసారి ఎమ్మెల్సీ బరిలో దిగేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు.

Also Read: సిద్దిపేట్‌కు సీఎం రేవంత్.. కోకాకోలా గ్రీన్ ప్లాంట్ ప్రారంభం

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వారం రోజుల నుండి కాంగ్రెస్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థులపై కూడా గాంధీబవన్ లో సమావేశం నిర్వహించారు.. అయితే ‌సిట్టింగ్ ఎమ్మెల్సీ ‌జీవన్ రెడ్డి జగిత్యాల లలో మీడియా తో‌ మాట్లాడారు. మరోసారి అవకాశం ‌ఇస్తే పోటీ చేస్తానని ప్రకటించారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటూ చెప్పుకొచ్చారు.. అయితే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ ‌కండువా కప్పుకున్నప్పటి నుంచి జీవన్‌రెడ్డి అధిష్టానం పై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఫిరాయింపుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి విమర్శలు గుప్పిస్తున్నారు.

కాంగ్రెస్ నేత, తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్య తర్వాత నేరుగా ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితులలో జీవన్ రెడ్డికి మరోసారి టికెట్ కేటాయిస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . అయితే ఆయన మాత్రం తన అనుచరులకి‌ పోటీకి సిద్దమని చెప్తున్నారు . మరి జీవన్ రెడ్డి టికెట్ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

Related News

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Big Stories

×