BigTV English

Pushpa 2: అక్కడ టికెట్ ధర రూ.3000.. ఇండియాలో ఎక్కడంటే..?

Pushpa 2: అక్కడ టికెట్ ధర రూ.3000.. ఇండియాలో ఎక్కడంటే..?

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప -2’. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే డిసెంబర్ 5వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పుష్ప-2 క్రేజ్ ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఇప్పుడు ముంబైలో సినిమా టికెట్లు రేట్లు చర్చనీయాంశంగా మారాయి. దేశవ్యాప్తంగా గత పది రోజులుగా పుష్ప -2 క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా సౌత్ సినిమాలను, సౌత్ హీరోలను పట్టించుకోని బాలీవుడ్ అభిమానులు ఇప్పుడు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో బీహార్ లోని పాట్నాలో జరిగిన భారీ ఈవెంట్ ను చూస్తే మనకు అర్థమవుతుంది.


ఒక్కో టికెట్ ధర రూ.3000..

ముఖ్యంగా ముంబైలో ప్రెస్ మీట్ కి కూడా మంచి స్పందన లభించింది. ముఖ్యంగా బన్నీ ఎక్కడ అడుగుపెట్టినా సరే స్వాగతిస్తూ అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇకపోతే అంతా బాగానే ఉంది కానీ సడన్గా టికెట్ ధరలు మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. నైజాం ఏరియాలో ముందు రోజు ప్రీమియర్ షో టికెట్ల రేట్లు భారీ మొత్తంలో పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రూ.1000 రూపాయల నుంచి రూ.1500 వరకు ప్రీమియర్ షో టికెట్లు రేట్లు పెంచగా.. ఇదే భారీ మొత్తం అనుకుంటే, ఆ ఏరియాలో మాత్రం ఏకంగా ఒక్కో టికెట్ ధర రూ.3000 పలుకుతూ ఉండడం ఆశ్చర్యంగా మారింది.


ముంబైలో ఒక్కో టికెట్ ధర రూ.3000..

ముంబైలోని మైసన్ పివిఆర్ జియో వరల్డ్ డ్రైవ్ లో మొదటిరోజు కొన్ని షోలకు సంబంధించిన టికెట్లు రేట్లు ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో టికెట్ల రేట్లు ఏకంగా రూ.3000 గా ఉండడంతో బుక్ మై షో లో ఈ విషయం కాస్త స్పష్టమైంది. ఈ స్థాయిలో టికెట్లు రేట్లు ఉంటే హిందీలో ఈ సినిమా రికార్డ్స్ స్థాయి ఓపెనింగ్స్ దక్కించుకోవడంతో పాటు లాంగ్ రన్ లో కూడా వసూళ్ళ తో కుమ్మేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొదటి రోజే రూ.450 కోట్ల వరకు వసూళ్ల అంచనా..

ఇకపోతే మైసన్ పివిఆర్ జియో వరల్డ్ డ్రైవ్ లోని ఇతర స్క్రీన్ లలో రూ.600 నుంచి రూ.1500 వరకు టికెట్లు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన స్క్రీన్స్ కొన్ని ప్రత్యేకమైన షోలకు మాత్రమే 3000 రూపాయల టికెట్లు రేట్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే పుష్ప-2 సినిమా టికెట్ల రేట్లు దారుణంగా ఉన్నాయనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలోని నైజాం ఏరియా విషయానికొస్తే.. మొదటి వారం రోజులు సినిమాను మధ్యతరగతి వారు చూసే పరిస్థితి లేదు అన్నట్టుగా తెలుస్తోంది. అభిమానుల జేబుకు చిల్లు పడడం తప్ప మరేమీ లేదు. ఇప్పుడు ఏపీలో కూడా రికార్డు స్థాయి హైక్ ఇవ్వడం జరిగిందని సమాచారం .అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ టికెట్లు రేట్లు గనుక భారీగా పెరిగితే మాత్రం వ్యతిరేకత వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే మొదటి రోజు రూ.450 కోట్ల వరకు వసూలు రాబట్టే అవకాశం ఉందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. మరి మేకర్స్ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×