BigTV English

Pawan Kalyan – CM Chandrababu: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, వాటి మాటేంటి?

Pawan Kalyan – CM Chandrababu: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, వాటి మాటేంటి?

Pawan Kalyan – CM Chandrababu: సీఎం చంద్రబాబుతో సమావేశమ య్యారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. సోమవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ భేటీ జరుగుతోంది. రాజకీయాలతోపాటు కీలకంగా మారిన రెండు అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.


ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఫోకస్ చేశారు సీఎం చంద్రబాబు-డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. కీలకంగా రెండు అంశాలపై ఇరువురు నేతలు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. వాటిలో కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యం, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు.

తొలుత రేషన్ మాఫియా విషయానికొస్తే  ఈ అంశం కేంద్ర-రాష్ట్రాలకు సంబంధించినది కావడంతో ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది అసలు చర్చ. విదేశాల నుంచి నౌకలు కాకినాడకు రావడం, ఇక్కడ రేషన్ బియ్యం లోడ్ చేసుకుని అక్కడికి వెళ్లిపోతున్నాయి.


నాలుగురోజుల కిందట రేషన్ మాఫియాను  రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు డిప్యూటీ సీఎం పవన్. అంతేకాదు షిప్‌ను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. షిప్‌ను సీజ్ వ్యవహారానికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీనిపై డిప్యూటీ సీఎం కాసింత ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ:  జగన్ కేసు కదలిక, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

ఇందుకు కారణాలు లేకపోలేదు. షిప్‌ను సీజ్ చేసే అధికారం కేవలం కస్టమ్స్ అధికారులకు మాత్రమే ఉంది. నౌకలో స్మగ్లింగ్ వస్తువులు ఉంటేనే కేవలం కేసు నమోదు చేస్తారు. రేషన్ బియ్యం స్మగ్గింగ్ చట్టం కిందకు రాదన్నది అధికారుల మాట.

ఈ వ్యవహారంపై న్యాయస్థానం తలుపు తట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. రేషన్ బియ్యం ఎగుమతిపై నిషేధమున్న నేపథ్యంలో కేసు వేయవచ్చని అంటున్నారు. దీనిపై ముఖ్యమంత్రి-డిప్యూటీ సీఎం మధ్య చర్చ జరగనుంది.

ఇప్పటికే పౌరసరఫరాల శాఖకు చెందిన ఇద్దరు అధికారులపై వేటు వేశారు. దీంతోపాటు ఆ జిల్లాకు సంబంధించిన ఇద్దరు అధికారులపై గరంగరంగా ఉన్నారట. ఎలాగైనా రేషన్ మాఫియాకు అడ్డకట్ట వేయాలన్నది పవన్ ఆలోచనగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో గ్రీన్ ఛానెల్‌ను అడ్డుకునేలా డీజీపీ ఆధ్వర్యంలో ఓ కమిటీ కూడా వేయాలని భావిస్తున్నారట డిప్యూటీ సీఎం. దానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసేందుకే ముఖ్యమంత్రితో ఆయన భేటీ అవుతున్నట్లు సమాచారం.

మరోవైపు డిసెంబర్ 10 వరకు రాజ్యసభ నామినేషన్లకు గడువు ఉంది. ఏపీలో వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేశారు. రెండు టీడీపీ, ఒకటి బీజేపీకి ఇవ్వాలనే ప్రచారం జరుగుతోంది.

ఏపీ-తెలంగాణ కోటా నుంచి ఆర్ కృష్ణయ్యను మళ్లీ రాజ్యసభకు పంపాలనేది బీజేపీ ప్రతిపాదనగా తెలుస్తోంది. మరో సీటుకు బీద మస్తాన్‌రావు మాట ఇచ్చారట సీఎం. మరొక సీటు కోసం టీడీపీ నుంచి ఆరుగురు, జనసేన నుంచి ఇద్దరు పోటీలో ఉన్నట్లు అంతర్గత సమాచారం.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×