BigTV English

Journalist Rahul | ప్రశ్నలతో సిఎంలనే ఇరుకున పెట్టే జర్నలిస్ట్.. ముఖ్యమంత్రుల ఫేవరెట్ ఇతనే..

Journalist Rahul | ప్రశ్నలతో సిఎంలనే ఇరుకున పెట్టే జర్నలిస్ట్.. ముఖ్యమంత్రుల ఫేవరెట్ ఇతనే..

Journalist Rahul | ”రాహుల్ వచ్చిండా? మేము బెస్ట్ ఫ్రెండ్స్” అని తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ జర్నలిస్ట్ రాహుల్‌ను ఉద్దేశించి పలుమార్లు మీడియా సమావేశాలలో మాట్లాడేవారు. కేసీఆర్ హయాంలో జర్నలిస్ట్ రాహుల్ బాగా ఫేమస్ అయ్యారు.


ఆయన ఇంగ్లీష్ దిగ్గజ వార్తా పత్రిక ‘ద హిందూ’ కోసం వార్తలందించేవారు. ముఖ్యంగా ఆయన తెలంగాణ సిఎంవోకు సంబంధించి వార్తలు సేకరించేవారు. తాజాగా తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బుధవారం ఒక ప్రెస్ మీట్‌లో జర్నలిస్ట్ రాహుల్‌ని గమనించి.. ప్రశ్నించేందుకు ముందుగా ఆయనకే అవకాశమిచ్చారు.

కేసీఆర్ ఒక వాక్చాతుర్యం ఉన్న సీనియర్ పొలిటీషియన్. ఒక రిపోర్టర్‌గా ఆయనను ప్రశ్నించాలంటే చాలా ధైర్యం, సామార్థ్యం కలిగి ఉండాలి. మరి అలాంటి రాజకీయ నాయకుడిపై మీడియా సభలలో నిత్యం ప్రశ్నలు కురిపించి, ఇరుకున పెట్టగల రిపోర్టర్‌గా రాహుల్ గుర్తింపు పొందారు.


కేసీఆర్‌ను ప్రశ్నించడానికి ఆయన ముందస్తుగా సమాచారమంతా సేకరించి.. సంసిద్ధంగా ఉండేవారు. కరోనా సమయంలో సిఎం కేసీఆర్‌ని తన ప్రశ్నలతో బాగా ఇబ్బంది పెట్టేవారు. అందుకే కేసీఆర్ సమాధానం చెప్పలేక అప్పడప్పుడూ.. ”రాహుల్.. ఎక్సట్రాలు ఎందుకయ్యా”, ”రాహుల్.. పిచ్చి ప్రశలు వేయకు” అని చెప్పేవారు.

కేసీఆర్ రెండోసారి సిఎంగా తన ప్రమాణస్వీకారానికి రాహుల్‌ని ఆఫీసుకు వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానించారు. కేసీఆర్ తను కారులో కూర్చోమని రాహుల్‌ని అడిగారు. ఆ సమయంలో కూడా ఆయన తన వృత్తి పట్ల నిబద్ధతను వదులుకోలేదు. కేసీఆర్ కారులో కూర్చోలేదు. ఆఫీసులో తన పని పూర్తి చేసుకొని వస్తానని చెప్పారు.

ఆంగ్ల పత్రిక ‘ద హిందు’లో మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్న రాహుల్‌.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కిరణ్ కుమార్ రెడ్డి క్లాస్ మేట్. కిరణ్ కుమార్ రెడ్డి కూడా సిఎంగా ఉన్నప్పుడు రాహుల్ పట్ల మర్యాద చూపించేవారు. ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లోని బస్తీ ప్రాంతానికి వెళ్లినప్పుడు.. ఆయన సెక్యూరిటీ సిబ్బంది రిపోర్టర్ రాహుల్‌ని తోసి వేయడంతో ఆయన కిందపడ్డారు. అది చూసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే రాహుల్‌ని తీసుకురావాలని.. ఆయన చాలా ముఖ్యమైన వ్యక్తి అని చెప్పారు.

జర్నిలిస్ట్‌గా సుదీర్ఘ అనుభవమున్న రాహుల్‌కు ఆంధ్ర, తెలంగాణ పట్ల మంచి అవగాహన ఉంది. ప్రజల సమస్యలపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు.

Journalist Rahul, Telangana, Chief Ministers favourite, KCR, Revanth Reddy, Kiran Kumar Reddy, Press Meet, The Hindu, Senior Journalist,

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×