BigTV English

Rohit Sharma Catch : రోహిత్ శర్మ క్యాచ్ పట్టుకోలేదా? నేలమీద వదిలేశాడా?

Rohit Sharma Catch : రోహిత్ శర్మ క్యాచ్ పట్టుకోలేదా? నేలమీద వదిలేశాడా?

Rohit Sharma Catch : ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ క్యాచ్ మ్యాచ్ ని మలుపు తిప్పింది. ఆ తర్వాత ఎవరూ కూడా ఆ పిచ్ మీద సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. దీంతో ఆ క్యాచ్ మీద రకరకాల వదంతులు షికార్లు చేశాయి. సరిగ్గా 47 పరుగులు చేసిన రోహిత్ శర్మ మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో అప్పటికే ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టి వెంటనే సిక్స్ కి ట్రై చేసి అవుట్ అయ్యాడు. అయితే ఆ క్యాచ్ ని ట్రావిస్ హెడ్ వెనక్కి 30 అడుగులు వెనక్కి పరుగెత్తి అద్భుతంగా పట్టాడు.


ఇప్పుడు దానిమీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. ఆ క్యాచ్ అందుకున్న వెంటనే హెడ్ నేల మీదపడ్డాడు. ఆ బాల్ కూడా నేలజారిపోయిందని మొదలుపెట్టారు. దీంతో ఇది ఆ నోటా ఈ నోటా ఐసీసీ చెవిన పడింది. కంట పడింది. వెంటనే దాని మీద పోస్ట్ మార్టమ్ మొదలుపెట్టారు. ఆ క్యాచ్ ని ఒకటికి వందసార్లు పరిశీలించారు. అది హెడ్ బాగానే పట్టాడు. అందులో లోపం ఏమీ లేదని నిగ్గు తేల్చారు.

వెంటనే ఒరిజినల్ క్యాచ్ ని ఐసీసీ రిలీజ్ చేసింది. ఇదే నిజమని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇలాంటివాటిని షేర్ చేసేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయాలని ప్రజలకు హితవు పలికింది. తెలిసీ తెలియకుండా షేర్ చేయవద్దని కోరింది.


ఎందుకంటే వరల్డ్ కప్ ఫైనల్ లో రోహిత్ శర్మ నాటౌట్ అని చూసేసరికి అందరూ అలర్ట్ అవుతారు. వెంటనే తమకి తెలిసిన వాళ్లకి షేర్ చేస్తారు. ఏదో తమ వ్యూస్ పెంచుకోవడానికి లేదా ఒక పనికిమాలిన సెన్సేషన్స్ క్రియేట్ చేయడానికి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తుంటారని సోషల్ మీడియా ఎక్స్ పర్ట్స్ చెబుతుంటారు.

క్రికెట్ గాడ్ సచిన్ కుమార్తె సారా కూడా ఈ డీప్ ఫేక్ ఫొటోస్ బారిన పడింది. తన పేరు మీద ఏకంగా ట్విటర్ లో ఒక ఫేక్ ఐడీ క్రియేట్ చేశారు. దాంట్లో గిల్ తో ఉన్న ఫొటోలను గ్రాఫిక్స్ చేస్తూ వాడుతున్నారు. దీనిపై తనెంతో బాధపడుతూ ట్విటర్ ఎక్స్ మేనేజ్మెంట్ కి లేఖ రాసింది.

అది తన ఎకౌంట్ కాదని, అలాంటి వాటిని బ్యాన్ చేయమని కోరింది. అంతేకాదు ప్రజలకు కూడా చిన్న పిలుపు ఇచ్చింది. మన సంతోషాలను, బాధలను, ఉద్వేగాలను పంచుకునే సామాజిక మాధ్యమాలను ఇలాంటి డీప్ ఫేక్ ఫొటోలు, వీడియాలు పెట్టి దుర్వినియోగం చేయవద్దని కోరింది. దీనివల్ల సెలబ్రిటీలు ఎవరూ ఇందులోకి రారని తెలిపింది.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×