BigTV English

Miyapur Rape Case : మియాపూర్ యువతి అత్యాచారం కేసులో ట్విస్ట్

Miyapur Rape Case : మియాపూర్ యువతి అత్యాచారం కేసులో ట్విస్ట్

Twist in Miyapur Rape Case(Hyderabad latest news): మియాపూర్‌ యువతి అత్యాచారం కేసులో JSR యాజమాన్యం పెద్ద ట్విస్ట్‌ ఇచ్చింది. యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు చెబుతున్న నిందితులు అసలు తమ ఉద్యోగులే కాదని కంపెనీ ప్రతినిధులు తేల్చి చెప్పారు. ఈ మేరకు ఒక ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని చేతులెత్తేశారు. ఆ ఇద్దరు కేవలం సేల్స్ సంస్థలకు చెందిన ఏజెంట్లు మాత్రమేనని అంటున్నారు.


అయితే రేప్ కేసు గురించి తనకేం తెలియదంటున్నారు JSR కంపెనీ టీమ్‌ లీడ్‌ సారిక. ఆ అమ్మాయి తమ కంపెనీలో జాయిన్‌ కాకుండా ఆమెను ఎంప్లాయిగా ఎలా గుర్తిస్తామని అన్నారు. ఆమె మొదట సైట్‌ విజిట్‌కి వచ్చిందన్నారు. నచ్చితేనే మార్కెటింగ్‌ చేస్తానని యువతి చెప్పిందని చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంతో పోలీసులే తేల్చాలి.

మరోవైపు మియాపూర్ లో యువతిపై అత్యాచారం కేసును జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ కేసులో పారదర్శకంగా విచారణ జరిపి 3 రోజుల్లో తమకు వివరణ ఇవ్వాలని తెలంగాణ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే బాధితురాలికి మెరుగైన వైద్య పరీక్షలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ లేఖలో పేర్కొంది. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందులెవరైనా సరే.. శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది.


Tags

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×