E-Paper
Advertisement

Team India in Special jersey: స్పెషల్ జెర్సీలో మెరిసిన టీమిండియా ఆటగాళ్లు..ఏముందంటే?

Team India in Special jersey: స్పెషల్ జెర్సీలో మెరిసిన టీమిండియా ఆటగాళ్లు..ఏముందంటే?

Team India in Special jersey(Latest sports news telugu): అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిచిన టీ20 ప్రపంచ కప్ 2024 విజేతగా భారత్ జట్టు నిలిచింది. తుఫాన్ ప్రభావంతో టీమిండియా ఆలస్యంగా భారత్‌కు వచ్చింది. ఉదయం భారత్‌కు చేరుకున్న భారత ఆటగాళ్లకు గ్రాండ్ వెల్ కమ్ ఇచ్చారు.

ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో భారత జట్టు భేటీ అయింది. ప్రపంచ కప్ గెలిచినందుకు ప్రధాని అభినందనలు తెలిపారు. ఈ మేరకు అందరూ కలిసి అల్పాహారం చేశారు. అయితే ప్రధాని నివాసంలో టీమిండియా ఆటగాళ్లు స్పెషల్ జెర్సీలో ప్రత్యక్షమయ్యారు. టీ20 ప్రపంచ కప్‌లో బరిలో దిగిన జెర్సీ మాదిరిగానే ఈ జెర్సీ ఉంది. అయితే అంతకుముందు ఉన్న జెర్సీకి స్వల్ప మార్పులు చేశారు.

స్పెషల్ జెర్సీలో ఇండియా పేరు కింద ఛాంపియన్స్ అని అదనంగా ఉంది. దీనిని ప్రత్యేకంగా ముద్రించినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీమిండియాకు బీసీసీఐ గ్రాండ్‌గా సన్మానించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే జెర్సీలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఛాంపియన్స్ అని యాడ్ చేశారు.

Also Read: ప్రధాని మోదీని కలిసిన భారత క్రికెట్ జట్టు

స్పెషల్ జెర్సీలో మరో మార్పు చేశారు. ఎడమవైపు ఉండే బీసీసీఐ లోగోపై రెండు స్టార్లను ముద్రించారు. అంతకుముందు ఒక్క స్టార్ మాత్రమే ఉండేది. 2007 టీ20 వరల్డ్ కప్ విజయానికి గుర్తుగా ఆ స్టార్ ఉండేది. ప్రస్తుతం 2024లో టీ20 వరల్డ్ కప్ గెలవడంతో రెండు స్లార్లుగా యాడ్ చేశారు. ఈ రెండు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మిగతాది అంతా పాత జెర్సీ మాదిరిగా నే ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

గుర్తు ప‌ట్ట‌లేని స్థితిలో బెన్ స్టోక్స్‌..భ‌యంక‌ర‌మైన వ్యాధి సోకిందంటూ ప్రచారం

Esha Singh: హైదరాబాద్ షూటర్.. ఈషా సింగ్ ప్రపంచ రికార్డు..!

వైభ‌వ్ ప‌చ్చి మోస‌గాడు, వాడు 15 ఏళ్లు కానేకాదు..విషం క‌క్కిన ఆస్ట్రేలియా మీడియా !

Sanjay Manjrekar: 33 ఏళ్ల ర‌జ‌త్ పాటిదార్ టీమిండియాకు ప‌నికిరాడు !

బుమ్రా బౌలింగ్ లో ఆడ‌టం నా వ‌ల్ల కాదు..పాకిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

Liam Livingstone: ఐపీఎల్ ప‌ర‌మ బోరింగ్ లీగ్..ప‌రువు తీసిన‌ SRH ప్లేయర్‌

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Big Stories

×