E-Paper
Advertisement

Jubilee Hills Results: జూబ్లీహిల్స్ ఫలితాల్లో బీజేపీకి ఘోర పరాభావం.. డిపాజిట్ గల్లంతు

Jubilee Hills Results: జూబ్లీహిల్స్ ఫలితాల్లో బీజేపీకి ఘోర పరాభావం.. డిపాజిట్ గల్లంతు
Advertisement

Jubilee Hills Results: ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. ముందు నుంచీ అందరూ ఊహించిన విధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ప్రధానంగా పోటీ సాగింది. ఏ దశలోనూ బీజేపీ పోటీ ఇవ్వలేకపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అనూహ్యంగా డిపాజిట్ కోల్పోయారు.

8 రౌండ్లలో 14 వేల ఓట్లు

ఎనిమిది రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 21 వేల ఆధిక్యంలో నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వెనుకంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి కేవలం 14243 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ అభ్యర్థి ఏడో రౌండ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు. కౌంటింగ్ కేంద్రం బయట మీడియాతో మాట్లాడిన లంకల దీపక్ రెడ్డి.. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. కాంగ్రెస్ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. చివరి మూడు రౌండ్లు బీజేపీకి అనుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జూబ్లీ ఓటమితో తగ్గిన జోష్

Advertisement

బీహార్ లో ఎన్డీఏ ఘనవిజయం దిశగా దూసుకుపోతుంది. అయితే జూబ్లీహిల్స్ ఫలితాలతో తెలంగాణ బీజేపీలో ఆ జోష్ కనిపించడంలేదు. జూబ్లీ ఓటమితో బీజేపీ కేడర్ నిరుత్సాహంలో ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం డిపాజిట్ వస్తుందని బీజేపీ కార్యకర్తలు భావించారు. కానీ డిపాజిట్ గల్లంతు అవ్వడంతో సంబరాలకు కాస్త దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీహార్ విజయంతో ఇప్పటికే తెలంగాణ బీజేపీ ఆఫీస్ వద్ద సంబరాలు మొదలుకావాల్సి ఉండగా.. ఆ జోష్ కనిపించడంలేదు.

Also Read: Jubilee Hills: ఇది చిన్న అంశం… ఒరిగేదేమీ లేదు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కవిత కీలక వ్యాఖ్యలు

కిషన్ రెడ్డి ఏమన్నారంటే?

Advertisement

జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. జూబ్లీహిల్స్ లో తాము ఎప్పుడూ ఒక కార్పొరేటర్ కూడా గెలవలేదన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు నుంచి ఎప్పుడు గెలవలేదని గుర్తుచేశారు. తాము ఉన్నంతలో ప్రయత్నం చేశామని చెప్పుకొచ్చారు. ఎంఐఎం మద్దతు, డబ్బుతోనే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఆరోపించారు.

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×