E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ చరిత్రలోనే వరస్ట్ టాస్కులు… స్ట్రాంగ్ కంటెండర్లను పక్కన పెట్టి ఇవేం పిల్ల బచ్చా ఆటలు ?

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ చరిత్రలోనే వరస్ట్ టాస్కులు… స్ట్రాంగ్ కంటెండర్లను పక్కన పెట్టి ఇవేం పిల్ల బచ్చా ఆటలు ?
Advertisement

Bigg Boss 9 Telugu : తెలుగులోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈసారి సీజన్ కొత్తగా ఉండబోతోంది అని స్టార్టింగ్ లో ఓ రేంజ్ లో ఊదరగొట్టారు. సీజన్ 9లో ఎప్పటిలా కాకుండా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీల మధ్య పోరు ఉంటుందని, ఆడతారా ? లేదంటే ఆడిస్తారో మీరే చూడండి అంటూ నాగ్ యాడ్ పదే పదే ప్లే అయ్యి, కాస్త బజ్ పెరిగింది. అనుకున్నట్టుగానే అగ్ని పరీక్ష అంటూ కామనర్స్ లో ఆరుగురిని సెలెక్ట్ చేసి మిగతా సెలబ్రిటీలతో కలిపి హౌస్ లోకి పంపారు. స్టార్టింగ్ లో అంతా గందరగోళం నడిచింది. మధ్య మధ్యలో కాస్త ఇంట్రెస్టింగ్ గా అన్పించినా ఇప్పుడు మరీ వరస్ట్ గా తయారయ్యింది షో. గత రెండు వారాలైతే మరీ దారుణం. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నారు.

బీబీ రాజ్యం అట్టర్ ఫ్లాప్ 

ఈ వారం అంతా బీబీ రాజ్యంలో రాజులు రాణులు అంటూ ఇమ్యూనిటీ, కెప్టెన్సీ కోసం కొత్త టాస్క్ పెట్టారు బిగ్ బాస్. కానీ ఈ టాస్క్ అంతా పరమ బోరింగ్ అన్పించింది. లైవ్ లో చూడడానికి ఏమీ లేదు. అది మాత్రమే కాదు కనీసం ఎపిసోడ్ లో కూడా అదే పరిస్థితి. షోను చూస్తున్న వాళ్ళకైనా పిచ్చి ఉండి ఉండాలి లేదా వేస్తున్న వాళ్ళకైనా ఉండాలి అని సునీల్ రేంజ్ లో అనుకోవాల్సిన పరిస్థితి. అసలు ఈ టాస్క్ ఎందుకు పెట్టారో బిగ్ బాస్ కే తెలియాలి. అసలు హౌస్ మేట్స్ కు అర్థం అయ్యిందా టాస్క్ అనేది కూడా అనుమానమే. ఎపిసోడ్ కంటే ప్రోమోలే ఓ రకంగా బెటర్ అన్పించాయి. ఈ వారమే కాదు గత వారం కూడా ఇలాగే వరస్ట్ గా సాగింది. డబుల్ ఏజెంట్ టాస్క్ ఈ వారం కంటే ఎంతో కొంత బెటర్ అన్పించినప్పటికీ, లాజిక్ లెస్ గా ఫీల్ వచ్చింది.

స్ట్రాంగ్ కంటెండర్లకు బ్యాడ్ లక్ 

Advertisement

గత వారం మొత్తం కళ్యాణ్ నుంచి మొదలు పెడితే నిఖిల్, గౌరవ్ ఇలా స్ట్రాంగ్ కంటెండర్లు అందరినీ ఒక్కొక్కరుగా పక్కన పెట్టేశారు. సాయికి అయితే పాపం ఒక్క గేమ్ అయినా ఆడి ప్రూవ్ చేసుకునే ఛాన్స్ దక్కలేదు. అసలే ఫ్యాన్ బేస్ తక్కువగా ఉన్న ఆ కుర్రాడు వీకెండ్ ఎలిమినేట్ అయిపోయాడు. ఇక ఈ వారం ఆ రాజులు రాణులు టాస్క్ ను బిగ్ బాస్ ఎవరి కోసం ప్లాన్ చేశారో ఓ పట్టాన అర్థం కాదు. కళ్యాణ్డె, మోన్, గౌరవ్, ఇమ్మాన్యూయేల్, భరణి వంటి కంటెండర్స్ అందరూ చేతులు ముడుచుకుని కూర్చోవాల్సి వచ్చింది. మామూలుగా అయితే కనీసం ఇమ్మూ ఎంటర్టైన్మెంట్ రిలీఫ్ ఇచ్చేది. కానీ ఈ వారం మొత్తం హౌస్ లో అది కూడా కంపించలేదు. కొద్దో గొప్పో రీతూ ఎంటర్టైన్మెంట్ కోసం ప్రయత్నించింది. బిగ్ బాస్ చరిత్రలో ఇంతకన్నా వరస్ట్ టాస్క్ లు లేవని చెప్పాలి. ఇంత నీరసంగా షో నడిస్తే టీఆర్పీ ఎక్కడి నుంచి వస్తుంది ?

Read Also : పెళ్ళైన మహిళతో కుర్రాడు… ఐఎండీబీలో 8.8 రేటింగ్… మలయాళ డార్క్ కామెడీ డ్రామా

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×