E-Paper
Advertisement

ఆప్‌కు పంజాబ్‌లో బిగ్ షాక్.. ఒకేసారి బీజేపీలోకి ముగ్గురు ఎమ్మెల్యేలు!

ఆప్‌కు పంజాబ్‌లో బిగ్ షాక్.. ఒకేసారి బీజేపీలోకి ముగ్గురు ఎమ్మెల్యేలు!
Advertisement

Punjab Politics: పంజాబ్‌లో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మరో ఎమ్మెల్యే కూడా ప్రతిపక్ష బీజేపీలో చేరారు. హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా, చేతన్ సింగ్ జౌరమజ్రా, కున్వర్ సింగ్ విజయ్ ప్రతాప్ సింగ్.. అధికారికంగా కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ ముగ్గురూ ఒకే రోజు తమ ఎమ్మెల్యే పదవులకు, పార్టీకి రాజీనామా చేశారు. పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు.. ఈ ముగ్గురి రాజీనామా.. ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. వీళ్లంతా.. ఢిల్లీలోని బీజేపీ నేషనల్ హెడ్‌క్వార్టర్స్‌లో.. లాంఛనంగా బీజేపీలో చేరారు.

2027 సమరంలో నెగ్గేదెవరు?

Advertisement

2027లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం.. 40 మంది అభ్యర్థులతో ఆప్ తొలి జాబితాను ప్రకటించింది. లిస్ట్ వచ్చిన రెండు రోజుల గ్యాప్‌లోనే.. ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఇది.. పంజాబ్ పాలిటిక్స్‌లో సెన్సేషన్‌ క్రియేట్ చేయడమే కాదూ.. పొలిటికల్ ఈక్వేషన్స్‌ని కూడా మార్చేసింది. ఆప్ ఫస్ట్ లిస్టులో.. 40 మంది ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇచ్చారు. ఇందులో సీఎం భగవంత్ మాన్ ధూరి నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. జైలులో ఉన్న క్యాబినెట్ మంత్రి సంజీవ్ అరోరాకు కూడా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. మొదటి లిస్టులో.. మరే మంత్రి పేరు లేదు. లిస్ట్ రిలీజైన కొన్ని గంటల్లోనే.. ఆప్‌లో తిరుగుబాటు మొదలైంది.

ఆప్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు: విజయ్ ప్రతాప్ సింగ్

Advertisement

బీజేపీలో చేరిన తర్వాత.. కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్.. ఆప్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రం నిరుద్యోగంతో పోరాడుతున్న సమయంలో.. అధికార వర్గాల్లో గ్యాంగ్‌స్టర్లు పట్టు సాధిస్తున్నారని విమర్శించారు. పంజాబ్ తన గుర్తింపు కోసం పోరాడుతోందని. పంజాబ్‌లో పంజాబీ సంస్కృతి మిగల్లేదని, గ్యాంగ్‌స్టర్లు.. సర్కారులో భాగమవుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో డ్రగ్స్, అవినీతిపై పోరాడేందుకే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ స్పష్టం చేశారు. ఇక, ఆమ్ ఆద్మీ పార్టీకి ఇలాంటి షాక్‌లు.. ఆరంభం మాత్రమేనని బీజేపీ చెబుతోంది. ఆప్ నుంచి భారీ వలస రాబోతోందంటున్నారు బీజేపీ నేతలు. భారీ పతనానికి సంబంధించిన సినిమా మిగిలే ఉందని హింట్ ఇస్తున్నారు. ఎన్నికల్లోపు మొత్తం పార్టీ విచ్ఛిన్నమవుతుందని బీజేపీ నేతలు గట్టిగా చెబుతున్నారు.

ఇరకాటంలో ఆప్ సర్కార్..

పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం, ప్రభుత్వంపైనే విమర్శలు ఎక్కుపెట్టడంతో.. ఆప్ సర్కార్ ఇరకాటంలో పడింది. పైగా.. ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఇలా జరగడం.. ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఫస్ట్ లిస్ట్ తర్వాతే ముగ్గురు వెళ్లిపోయారంటే.. నెక్ట్స్ లిస్ట్‌కు ఇంకెన్ని వికెట్స్ పడతాయన్నది కూడా ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ప్రత్యర్థి బీజేపీ కూడా ఇంకా సినిమా మిగిలే ఉందని చెబుతుండటం కూడా.. స్టేట్ పాలిటిక్స్‌లో హీట్ పెంచుతోంది. వీటన్నింటిని తట్టుకొని, బీజేపీని ఎదుర్కొని.. మరోసారి పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ జెండా ఎగరేసి.. పట్టు నిలుపుకుంటుందా? లేక పక్కకు తప్పుకుంటుందా? అన్నది ఇంకొన్ని నెలల్లో తేలిపోతుంది.

Also Read: ఓట్ల గల్లంతుపై యోగి సంచలన వ్యాఖ్యలు.. ఇరకాటంలో పడ్డ కేంద్రం, సిఈసి!

Tags

Related News

అమిత్ షా మాస్టర్ ప్లాన్ వర్సెస్ ప్రతిపక్షాల ఓట్ బచావ్.. 5 రాష్ట్రాల పోరులో గెలిచేదెవరు?

ఓట్ల గల్లంతుపై యోగి సంచలన వ్యాఖ్యలు.. ఇరకాటంలో పడ్డ కేంద్రం, సిఈసి!

అమెరికా పౌరుడివై ఉండి భారత్‌లో నిరసనలా? ఇమ్రాన్ ఖాన్‌పై బాంబే హైకోర్టు ఫైర్!

ఢిల్లీ ప్రజలకు శుభవార్త.. ‘గ్రీన్ క్రాకర్స్’ కాల్చుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి!

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. విద్యుత్ తీగలు తగిలి 8 మంది కార్మికులు బలి

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన వ్యాన్.. ఆరుగురు దుర్మరణం!

ప్రభుత్వ ఉద్యోగం.. ఓఎన్‌జీసీలో 3047 జాబ్స్.. త్వరగా అప్లై చేయండి

Big Stories

Advertisement
×