E-Paper
Advertisement

కన్‌స్ట్రక్షన్లకు మంచినీళ్లు వాడుతున్నారా.. జలమండలి మరో మాస్టర్ ప్లాన్!

కన్‌స్ట్రక్షన్లకు మంచినీళ్లు వాడుతున్నారా.. జలమండలి మరో మాస్టర్ ప్లాన్!
Advertisement

Green Water: హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సంరక్షణ, శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగాన్ని ప్రోత్సహించేందుకు జలమండలి ప్రారంభించిన గ్రీన్ వాటర్ ట్యాంకర్ల కార్యక్రమం రెండో రోజైన సోమవారం కూడా కొనసాగింది. ఈ నెల 1వ తేదీన జలమండలి 37వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా రెండో రోజైన సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల వరకు 79 ట్యాంకర్ల ద్వారా 124 ట్రిప్పులు నిర్వహించి, మొత్తం 1,107 కిలోలీటర్ల (11.07 లక్షల లీటర్లు) శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసినట్లు జలమండలి వెల్లడించింది.

14 ట్యాంకర్ల ద్వారా..

మూడు రీజియన్ల పరిధిలోని 18 మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీలు) నుంచి ఈ సరఫరా జరిగినట్లు పేర్కొంది. ఇందులో ప్రభుత్వ శాఖల అవసరాలకు 609.5 కిలోలీటర్లు, ప్రైవేట్ అవసరాలకు 497.5 కిలోలీటర్ల నీటిని సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. సైబరాబాద్ రీజియన్‌లో 14 ట్యాంకర్ల ద్వారా 34 ట్రిప్పులు నిర్వహించి 505 కిలోలీటర్ల నీటిని సరఫరా చేయగా, హైదరాబాద్ రీజియన్‌లో 36 ట్యాంకర్ల ద్వారా 54 ట్రిప్పులతో 295.5 కిలోలీటర్లు, మల్కాజ్ గిరి రీజియన్‌లో 29 ట్యాంకర్ల ద్వారా 36 ట్రిప్పులతో 306.5 కిలోలీటర్ల నీటిని సరఫరా చేసినట్లు తెలిపింది.

తాగు నీటి పొదుపునకు ప్రాధాన్యత..

Advertisement

నిర్మాణ పనులు, పార్కులు, గార్డెనింగ్, ల్యాండ్‌స్కేపింగ్, ఇతర తాగు యేతర అవసరాలకు శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా జలమండలి ప్రత్యేక చర్యలు చేపట్టింది. తద్వారా మంచినీటి వనరులపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు శుద్ధి చేసిన నీటి పునర్వినియోగాన్ని విస్తరించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జలమండలి పేర్కొంది. గ్రీన్ వాటర్ ట్యాంకర్ల కార్యక్రమం అమలును రోజువారీగా పర్యవేక్షించేలా జలమండలి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది. ప్రతి రీజియన్‌లో పని చేస్తున్న ట్యాంకర్ల సంఖ్య, నిర్వహించిన ట్రిప్పులు, సరఫరా చేసిన నీటి పరిమాణం, ప్రభుత్వ, ప్రైవేట్ వినియోగం, ఎస్టీపీల వారీగా సరఫరా వివరాలను సమీక్షించనున్నారు.

ఈ కార్యక్రమంలో..

అలాగే ట్యాంకర్ల వినియోగ సామర్థ్యాన్ని పెంచడం, బుకింగ్స్‌కు అనుగుణంగా సరఫరాను విస్తరించడం, మరిన్ని ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయడంపై దృష్టి సారించనున్నారు. తాగునీటిని కేవలం తాగడానికి, వంటా వార్పు వంటి ఇంటి పనులకు న పనులకే వినియోగించి, నిర్మాణాలు, గార్డెనింగ్, ఇతర తాగేతర అవసరాలకు శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని జలమండలి కోరింది.

Advertisement

Also read: అప్పులు తీర్చేందుకు చెయిన్ స్నాచింగ్.. బైక్ మెకానిక్ అరెస్ట్!

Tags

Related News

ఎమ్మెల్యే మల్లారెడ్డికి హైడ్రా బిగ్ షాక్.. ఫామ్‌హౌస్‌ ప్రహరీ గోడ కూల్చివేసిత!

క్యాంపస్ హబ్ AI ప్రొడక్ట్ లాంచ్‌లో కేటీఆర్.. గ్రామీణ యువతపై ప్రశంసల జల్లు

కీసర, మేడ్చల్ లో పేదల భూములపై అక్రమార్కుల కన్ను..!

గద్వాల పట్టణంలో షాకింగ్ ఘటన.. ప్రభుత్వ బడి భవనం తీవ్ర శిథిలం!

జహీరాబాద్ కో-ఆప్షన్ ఎన్నికల వివాదం.. హైకోర్టుకు కౌన్సిలర్ నామ స్రవంతి?

ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై సీఈవోతో కవిత భేటీ.. గడువు పెంపునకు విజ్ఞప్తి!

జూపాక గ్రామంలో సివిల్ రైట్స్ డే రద్దు.. ప్రజావాణిలో ఫిర్యాదు!

Big Stories

Advertisement
×