E-Paper
Advertisement

Kadiyam Flex: బీఆర్ఎస్ లోనే కడియం.. స్టేషన్ ఘనపూర్ లో హై టెన్షన్

Kadiyam Flex: బీఆర్ఎస్ లోనే కడియం.. స్టేషన్ ఘనపూర్ లో హై టెన్షన్
Advertisement

Kadiyam Flex: జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఫ్లెక్సీల రాజకీయం రాజుకుంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వినూత్న నిరసన ఎదురైంది. తిరుమలనాథ స్వామి దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ శ్రీకారోత్సవానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో ఫ్లెక్సీ రాజకీయంపై చర్చ మొదలైంది. ఫ్లెక్సీతో బీఆర్ఎస్ శ్రేణులు వినూత్నంగా నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు కడియం శ్రీహరి వివరణ ఇవ్వడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

బీఆర్ఎస్ ఫ్లెక్సీలు

ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రికి స్వాగ‌తం సుస్వాగ‌తం అంటూ పెట్టిన ఫ్లెక్సీలను తొల‌గించాల‌ని మున్సిప‌ల్ సిబ్బంది, పోలీసులు ప్రయ‌త్నించ‌గా బీఆర్ఎస్ నేత‌లు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెల‌కొంది. బీఆర్ఎస్ నేత‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

బీఆర్ఎస్ లోనే ఉన్నా

Advertisement

పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు స్పీకర్ కు వివరణ ఇస్తున్నారు. ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు స్పీక‌ర్ కు లిఖిత పూర్వకంగా వివ‌ర‌ణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కడియం బీఆర్ఎస్ లో ఉన్నార‌ని ఫ్లెక్సీలు పెట్టారు. క‌డియం బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరార‌ని బీఆర్ఎస్ నేతలు కోర్టుకు వెళ్లారు. కడియంపై అన‌ర్హత వేటు వేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అయితే కడియం మాత్రం తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.

Also Read: KCR: రాజకీయంగా కేసీఆర్ యాక్టివ్.. ఆఫ్టర్ లాంగ్ టైం హైదరాబాద్‌కు గులాబీ బాస్

Advertisement

ఫ్లెక్సీల్లో ఒక వైపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫొటో.. మరోవైపు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Related News

సీఎం రేవంత్ రెడ్డిపై.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..?

త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు.. మంత్రి పొన్నం క్లారిటీ!

తెలంగాణ SIR 2026 ఓటర్ల జాబితా పరిశీలన.. నాయకులపై టీపీసీసీ చీఫ్ ఫైర్..!

ఖమ్మం జిల్లాలో ఘోరం.. కారులో భార్యను హత్య చేసిన భర్త!

అమ్మోరు సాక్షిగా రూ.లక్ష లంచం.. పోశమ్మ గుడి వద్ద ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు!

సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఆ అంశాలపై స్పెషల్ ఫోకస్?

జీహెచ్ఎంసీలో రెనొవేషన్ దందా కలకలం.. ఆఫీసర్ల మోజుకు కోట్లు ఖర్చు!

నడిరోడ్డుపై డెలివరీ బాయ్స్ నరకం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

Big Stories

Advertisement
×