E-Paper
Advertisement

నేను రాజీనామా చేస్తా.. నువ్వు చేస్తావా ఉత్తమ్.. హరీష్ రావు సవాల్!

నేను రాజీనామా చేస్తా.. నువ్వు చేస్తావా ఉత్తమ్.. హరీష్ రావు సవాల్!
Advertisement

Harish Rao: స్వేచ్చ బ్యూరో: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువుఅని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. 240 టీఎంసీలు మేడిగడ్డ నుంచి వాడుకోవడానికి అన్ని రకాల అనుమతులు ఉన్నయని, మూడు ఉత్తరాల్లో కనీసం 160 కాదు కదా, 102 కూడా లేదు అన్నరని, అసలు ఇందులో నీళ్లు ఎంత లిఫ్టు చేస్తరు? హైదరాబాద్, ఇతర జిల్లాల మంచి నీళ్లకే 50 టీఎంసీలు కావాలె. మరి సాగు నీళ్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఏదేమైనా కాళేశ్వరం తెలంగాణకు వరం, వరప్రదాయినీ అన్నారు. రాజకీయాల కోసం మూడేళ్ల నుంచి మేడిగడ్డకు మరమ్మతు చేయడం లేదు.

మాకు అభ్యంతరం లేదు..

నీళ్లు ఎత్తడం రాష్ట్రం నిర్ణయమే అని ఎన్డీఎస్ఏ చెంప చెల్లుమనేలా చెప్పింది. అన్నారం, సుందిళ్ల బేషుగ్గా ఉన్నాయని సిడబ్లుపిఆర్ఎస్ రిపోర్టు చెప్పింది.. అయినా కేసీఆర్ కి ఎక్కడ పేరు వస్తుందో అని ప్రాజెక్టును పడావు పెట్టారు. మూడేళ్లుగా మరమ్మతు చేయకుండా కాలయాపన చేసారని మండిపడ్డారు. తమ్మిడిహట్టి మీరు తెచ్చినా మాకు అభ్యంతరం లేదు. కేసీఆర్ అన్ని ఆలోచించి, 240 ఇక్కడ ఎత్తుకుంటం, ఉమ్మడి ఆదిలాబాద్ కోసం చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా లక్ష ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని నిర్ణయించినం..వార్దా 20 టీఎంసీలతో డీపీఆర్ తయారు చేసినం కేంద్రానికి పంపినం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిపిఆర్ వాపస్ వచ్చిందన్నారు. అవి ముందుకు తీసుకుపోకుండా రాజకీయాల కోసం ఇలాంటివి చేస్తున్నారు. బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.

మూడేళ్లు కాలయపాన..

Advertisement

రాజకీయాలు ముఖ్యం కాదు రాస్ట్ర ప్రయజనాలు ముఖ్యం మూడేళ్లు కాలయపాన చేసారు. ఆ కమిటీ ఎప్పుుడు తేల్చాలి, ఎప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావలి. ఎప్పుడు అవుతుందన్నారు. కాళేశ్వరమే తెలంగాణకు వరం.మీరు చెబుతున్నది ఏంటి 25వేల కోట్లు ఖర్చు చేసి తమ్మిడిహట్టి నుంచి నీళ్లు తెచ్చి సుందిళ్లల పోస్తరట..ఎక్కడ ఆయకట్టు లేదు. వచ్చే నీళ్లు 240 టీఎంసీలు వస్తయా కాలేశ్వరం లాగా. మొత్తం పని అయ్యే వరకు అంచనాలు 30వేలు, 40వేలు అవుతుంది కావొచ్చు.

Also read: మన ఆటోను వదల్లేకపోయారు.. ఏకంగా సముద్రం దాటించి బ్రిటన్‌కు తీసుకెళ్లారు!

రాజకీయ కుట్ర కాదా ఇదంతా?

Advertisement

తమ్మిడిహట్టి కడితే మాకు అభ్యంతరం లేదు, అయితుందో కాదో కాలం తేల్చుతుంది. కానీ వెంటనే మేడిగడ్డ మరమ్మతు చేయండి. కన్నెపల్లి కట్క ఒత్తండి. గ్రావిటీ ద్వారా ఎట్ల తెస్తవు ఉత్తం .. నొక్కి చెప్పాం అని ప్రెస్ నోట్ ఇచ్చారు, నేను నొక్కి అడుగుతున్నా. నేను రాజీనామా చేస్తా, ఉత్తం నువ్వు చేస్తవా రాజీనామా? గ్రావిటీ ద్వారా తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తెస్తవా? ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నరు ప్రజలు అమాయకులా? ముఖ్యమంత్రి కార్యాలయం బాధ్యత లేకుండా ఎలా విడుదల చేస్తారు
డీపీఆర్ బయట పెట్టండి. నొక్కి నొక్కి అడుగుతున్నా సమాధానం చెప్పాలన్నారు. గోబెల్స్ ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

మూడు లేఖలు..

బిఆర్ఎస్ పార్టీ అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకున్నది. మూడు లేఖల ద్వారా తమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని తేల్చిన తర్వాతనే మేడిగడ్డకు పోవాల్సి వచ్చింది..అన్ని కొనగలం కానీ, నీళ్లను కొనలేం అంటున్న రేవంత్ రెడ్డి.. ఎందుకు నీళ్లు లిఫ్ట్ చేయడం లేదు. ఎంపీ చామల కిరణ్మాట్లాడుతున్నరు, లెవల్ లేదు ఎట్ల లిఫ్ట్ చేస్తం అని, లెవల్ ఉన్నప్పుడు కన్నెపల్లి నుంచి ఎందుకు లిఫ్ట్ చేయలేదు. గడ్డిపీకారా? కరువును తరిమి తరిమి కొట్టే శక్తి ఉన్నది కాళేశ్వరంకు ఉందన్నారు.

Also read: మన ఆటోను వదల్లేకపోయారు.. ఏకంగా సముద్రం దాటించి బ్రిటన్‌కు తీసుకెళ్లారు!

Tags

Related News

నేడు హైడ్రా కు 42 ఫిర్యాదులు.. వీటిలో ఎక్కువ సమస్యలు ఇవే..?

బోడుప్పల్‌లో ఫేక్ డాక్టర్ల దందాకు చెక్.. రిజిస్ట్రేషన్ లేని మమత క్లినిక్ సీజ్!

ఫామ్‌హౌస్‌లో యువకుడి అనుమానాస్పద మృతి!

రాష్ట్రం నీటి సంక్షోభంలో ఉంటే.. ఢిల్లీ బాటపడతారా? కాంగ్రెస్ నిరసనలపై రాంచందర్ రావు ఫైర్!

తెలంగాణలో పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన బీజేపీ నేతలు!

ఇంటిపై యూట్యూబ్ లోగో వేయించుకొని.. లక్షల్లో సంపాదిస్తున్న యువత!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తల్లీకూతుళ్ల చోరీలు.. రూ. 10.60 లక్షల సొత్తు స్వాధీనం!

Big Stories

Advertisement
×