BIG BREAKING: ఝార్ఖండ్‌లో తీవ్ర విషాదం.. మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) వ్యవస్థాపక అధినేత శిబూ సోరెన్ (81) అనారోగ్యంతో ఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణ వార్తను ఆయన కుమారుడు, ప్రస్తుత ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తెలిపారు. శిబూ సోరెన్ గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. గత నెల రెండున్నర వారాల క్రితం స్ట్రోక్‌కు గురైన ఆయన, ఒక నెలగా లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌పై ఉన్నారు. ఆగస్టు 2న ఆయన పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు, అయినప్పటికీ ఆయన ఆరోగ్యం క్షీణించి మృతి చెందారు.
ఝార్ఖండ్ రాజకీయాల్లో గణనీయమైన ప్రభావం..
శిబూ సోరెన్ ఝార్ఖండ్ రాజకీయాల్లో గణనీయమైన ప్రభావం చూపిన నాయకుడు. ఆయన ఎనిమిది సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై, దుమ్కా నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించారు. 2004-2005 మధ్య కేంద్రంలో బొగ్గు శాఖ మంత్రిగా పనిచేశారు. ఝార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన చేసిన కృషి ఎంతో గుర్తించదగినది. JMM నాయకుడిగా, ఆదివాసీ హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం ఆయన అవిశ్రాంతంగా పోరాడారు. 2002, 2008-2009, 2010లో మూడు పర్యాయాలు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన నాయకత్వంలో JMM ఝార్ఖండ్‌లో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగందని చెప్పారు.
Also Read: నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం..
తీరని శోకం..
2023లో శిబూ సోరెన్ కరోనా బారిన పడి, రాంచీలోని మేదాంత హాస్పిటల్‌లో చికిత్స పొందారు. అప్పటి నుండి ఆయన ఆరోగ్యం అస్థిరంగా ఉంది. ఆయన మరణంతో ఝార్ఖండ్ రాజకీయాల్లో ఒక యుగం ముగిసినట్లు భావించారు. ఆయన తనయుడు హేమంత్ సోరెన్ ప్రస్తుతం JMM నాయకత్వంలో ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. శిబూ సోరెన్ మరణంపై రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆదివాసీ సంక్షేమం కోసం చేసిన కృషిని ప్రశంసించారు.
ఝార్ఖండ్ మాజీ సీఎం, JMM వ్యవస్థాపకుడు శిబు సోరెన్ కన్నుమూత
ఢిల్లీలోని RML హాస్పిటల్ ల్లో చికిత్స పొందుతూ 8.56 గంటలకు మృతి
గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శిబు సోరెన్
8 సార్లు ఎంపీగా పని చేసిన శిబు సోరెన్ pic.twitter.com/5nH7hC88R4
— BIG TV Breaking News (@bigtvtelugu) August 4, 2025