E-Paper
Advertisement

Kalvakuntla Kavitha: ఆ సమయానికి పార్టీ రావడం ఖాయం.. గతాన్ని తలుచుకుంటూ కవిత ఎమోషనల్

Kalvakuntla Kavitha: ఆ సమయానికి పార్టీ రావడం ఖాయం.. గతాన్ని తలుచుకుంటూ కవిత ఎమోషనల్
Advertisement

Kalvakuntla Kavitha: తెలంగాణలో జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చేనాటిని పార్టీ పెట్టే అవకాశం ఉందన్నారు తెలంగాణ జాగృతి చీఫ్ కవిత. ఇప్పటికే మూడు పార్టీలున్నాయని, అయినా సరే తప్పకుండా ప్రజలు తమను ఆదరిస్తారని చెప్పుకొచ్చారు. అందుకు ఎగ్జాంఫుల్ మొన్నటి జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలేనని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయని అధికార పార్టీ విజయం సాధించడం వెనుక బీఆర్ఎస్-బీజేపీలు కారణమని చెప్పుకొచ్చారు. బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గతాన్ని తలచుకుంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు.

గతాన్ని తలుచుకుంటూ కవిత ఎమోషనల్

Advertisement

రాజకీయంగా తల్లిదండ్రులతో విభేదాలు ఉండవచ్చని, ఆ విధంగా కలిసేది లేన్నారు. వాటి గురించి సలహాలు తీసుకునేది లేదని తెగేసి చెప్పేశారు. పిల్లలు ఏదైనా నిర్ణయం తీసుకుని అడుగులు వేస్తే సక్సెస్ కావాలని తల్లిదండ్రులు కోరుకుంటారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తే పార్టీకి రాజీనామా చేసేవారా అంటూ అడిగిన ప్రశ్నకు కీలక విషయాలు బయట పెట్టారు.

తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా తాను కచ్చితంగా బయటకు వచ్చేదానినని అన్నారు. ఏ రోజు అయితే ఫలితాలు వచ్చాయో.. ఆనాడు తాను, తన భర్త ఇద్దరం కలిసి రాజీనామా లేఖలు పట్టుకుని వెళ్లామన్నారు.  తాము వెళ్లేసరికి పార్టీ ఓడిపోతున్నట్లు ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. అలాంటి సమయంలో రాజీనామా లేఖ ఇవ్వడం సరికాదని వెనక్కి తగ్గామన్నారు.

Advertisement

ఆ సమయానికి పార్టీ రావడం ఖాయం-కవిత

తాము నిర్వహించిన జనం బాట కార్యక్రమంలో డజను వరకు ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యాయని గుర్తు చేశారు కవిత. తాను పదవుల గురించి ఏనాడూ ఆశపడ లేదన్నారు. తనకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పినప్పుడు ఎంపీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ ఇవ్వాలని కోరారని గుర్తు చేశారు. పార్టీకి అవసరం ఉండడంతో ఎమ్మెల్సీ ఇచ్చారని, తాను మాత్రం కోరలేదన్నారు. పార్టీలో బినిఫిట్స్ మాత్రమేకాదు కష్టాలు కూడా వస్తాయన్నారు.

తాను పార్టీలో ఉన్నప్పుడు నేతలు ఏం మాట్లాడానో మీరు చూశారని, సస్పెండ్ చేసిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో చూడాలన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారని నేతలు పదే పదే అంటున్నారని, మరి పార్టీ కోసం తానేమీ చేయలేదా అంటూ బీఆర్ఎస్ హైకమాండ్‌ని  ప్రశ్నించారు.

ALSO READ:  గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక సెల్.. మంత్రి లక్ష్మణ్ కీలక ప్రకటన

పార్టీ నుంచి నేతలను సస్పెండ్ చేసే ముందు ఒక పద్దతి ఉంటుందన్నారు. ఎవరైతే కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతారో ఆయన.. తనను సస్పెండ్ చేసే కమిటీ ఛైర్మన్ అని చెప్పుకొచ్చారు. పార్టీ ఓటమి తర్వాత రవీంద్రరావు మీడియా సమావేశంలో ఏ మాట్లాడారో ఒక్కసారి పరిశీలించాలన్నారు. అంతేగానీ సోషల్ మీడియాతో పార్టీలు బతకవని అన్నారు. ఇంకా చాలా విషయాలే ఆమె బయటపెట్టారు.

 

 

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×