E-Paper
Advertisement

Gulf Workers: గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక సెల్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కీలక ప్రకటన

Gulf Workers: గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక సెల్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కీలక ప్రకటన
Advertisement

Gulf Workers: ధర్మపురి శాసనసభ్యులు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గల్ఫ్ దేశాల్లో ఉంటున్న తెలంగాణ కార్మికులకు , వారి కుటుంబాలకు భరోసా కల్పించారు. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అక్కడి మన ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రాష్ట్ర ప్రభుత్వం వారికి పూర్తి అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణ బిడ్డల రక్షణ విషయంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో నేరుగా చర్చించి  గల్ఫ్ దేశాల్లో ఉన్న వారికి దౌత్యపరమైన మద్దతు , అన్ని విధాలా సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజల భద్రత కోసం ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

ముఖ్యంగా జగిత్యాల జిల్లా నుండి వేలాది మంది ప్రజలు ఉపాధి కోసం దుబాయ్, ఖతార్, ఇరాన్ వంటి దేశాలకు వెళ్లిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారి సమస్యలను , అక్కడి పరిస్థితులను రాష్ట్ర పర్యటనకు రానున్న రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఆయన వెల్లడించారు. తద్వారా ఉన్నత స్థాయిలో చర్చించి సత్వర పరిష్కారాలు వెతికే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గల్ఫ్ కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి , వారికి అవసరమైన సహాయాన్ని తక్షణమే అందించడానికి ఒక ప్రత్యేక సెల్ (Special Cell) ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ సెల్ ద్వారా బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులు నేరుగా సంప్రదించి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని తెలిపారు.

Advertisement

‘తెలంగాణ బిడ్డలు ఎక్కడ ఉన్నా వారి క్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం. గల్ఫ్ దేశాల్లో ఉన్న మన సోదరులు ధైర్యంగా ఉండాలి. మీకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది,’ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భరోసా ఇచ్చారు.

Also  Read: కుప్పం పోలీసుల మెరుపు దాడి.. అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్!

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×