E-Paper
Advertisement

Kavitha Exclusive Interview: బీఆర్ఎస్ హైకమాండ్‌పై రుసరుస.. సంతోషం లేకుండా చేశారంటూ కవిత ఆగ్రహం

Kavitha Exclusive Interview: బీఆర్ఎస్ హైకమాండ్‌పై రుసరుస.. సంతోషం లేకుండా చేశారంటూ కవిత ఆగ్రహం
Advertisement

Kavitha Exclusive Interview: అధికారం పోయినా బీఆర్ఎస్ రూటు మారలేదా? చేసిన తప్పులు ఆ పార్టీ పదే పదే చేస్తోందా? కవితకు సంతోషం లేకుండా బీఆర్ఎస్ చేస్తోందా? మరోసారి బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు? బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు బయటపెట్టారు తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత.

బీఆర్ఎస్ హైకమాండ్‌పై మరోసారి కవిత రుసరుస

Advertisement

ఢిల్లీ లిక్కర్‌ కేసులో నిర్ధోషిగా బయటపడడంతో తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవితను బిగ్ టీవీ పలకరించింది. ఈ సందర్భంగా కీలక విషయాలు ప్రస్తావించారామె. రాజకీయాల్లో ధైర్యం, ఓపిక ఉండాలన్నారు. ఓటమిని అంగీకరించే ఆత్మస్థైర్యం కూడా ఉండాలన్నారు. లిక్కర్ కేసులో న్యాయస్థానం తీర్పు తనకు అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో కుటుంబసభ్యులు, కార్యకర్తలతో ఆనందంగా ఉన్నానని తెలిపారు.

ఆ సందర్భంలో జరిగిన పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ కేసు వల్లే తాము ఓడిపోయామని స్వయంగా బీఆర్ఎస్ అగ్రనేతలు చెప్పడంపై రుసరుసలాడారు. కనీసం తనను గంట కూడా సంతోషం  లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత కొత్త ప్రయాణం మొదలుపెట్టాలని భావిస్తున్న సమయంలో తనకు పెద్ద రిలీఫ్ వచ్చిందన్నారు.

Advertisement

తనను కవచంలా బీఆర్ఎస్ వినియోగించుకుందని వ్యాఖ్య

ఆ రిలీఫ్ మీద ట్వీట్ చేస్తారని ఎవరైనా భావిస్తారని అన్నారు. ఈ కేసు వల్లే తాము ఓడిపోయామని చెప్పడం కాసింత మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్‌ని తనను కవచంలా వాడుకుంటున్నారనే భావన తనకు వచ్చిందన్నారు. అది ముమ్మాటికీ కరెక్టు కాదన్నారు. ఆ పార్టీలో లోపాలపై చర్చ జరగాలని తాను మొదటి నుంచి ఓపెన్‌గా చెబుతున్నారని గుర్తు చేశారు.

ఉద్యమంలో కష్టపడినవారికి, కార్యకర్తలకు ఆ పార్టీలో ఎలాంటి గుర్తింపు లేదని తేల్చేశారు. సంబంధం లేనివారికి బీఆర్ఎస్ పదవులు ఇచ్చిందన్నారు. ఈ విషయాలపై ఆనాడు పార్టీ సమావేశంలో పదే పదే ప్రస్తావించానన్నారు.  ఓడిపోయిన తర్వాత  ఏర్పాటు చేసిన పార్టీ సమావేశాల్లో ఈ విషయాన్ని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

ALSO READ: ముంచుకొస్తున్న ఎండలు.. సాధారణం కంటే ఎక్కువగా పెరగనున్న ఉష్ణోగ్రతలు

తాను కేవలం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడడం లేదన్నారు. బీఆర్ఎస్ కంటే అధికార పార్టీ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు. ఛానెళ్లు స్పైసీగా ఉండే వాటిని పికప్ చేస్తాయన్నారు. బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేయడం వల్ల తాను ఈ పరిస్థితుల్లో ఉన్నారని, దీనివెనుక ఎవరూ లేరని సూటిగా తేల్చేశారు. ఇంకా చాలా విషయాలు బయటపెట్టారు కవిత. వాటిని ఈ కింది వీడియోలో చూద్దాం.

 

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×