E-Paper
Advertisement

ధరణి అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా సీఐడీ మెరుపు దాడులు.. నలుగురు అరెస్టు!

ధరణి అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా సీఐడీ మెరుపు దాడులు.. నలుగురు అరెస్టు!
Advertisement

Dharani Portal Scam: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ధరణి పోర్టల్ అక్రమాల వ్యవహారంపై సీఐడి (CID) విభాగం విరుచుకుపడింది. శనివారం వేకువజాము నుంచే 15 ప్రత్యేక బృందాలు ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా మెరుపు దాడులు నిర్వహించాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి, గజ్వేల్‌తో పాటు పలు కీలక ప్రాంతాల్లో సీఐడీ అధికారులు సోదాలు చేపట్టి, భూముల రికార్డుల నమోదులో జరిగిన భారీ అక్రమాలపై దృష్టి సారించారు.

నలుగురు అరెస్ట్..

ఈ ఆపరేషన్‌లో భాగంగా ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న పలువురు ఆపరేటర్లను, అలాగే అక్రమాలకు సహకరించిన ప్రైవేటు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు లభించడంతో నలుగురిని అధికారికంగా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న ఇతరులను రహస్య ప్రాంతంలో విచారిస్తూ మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

భూదాన్ భూముల మార్పిడిపై ఆరా

Advertisement

కోర్టు ఉత్తర్వుల మాటున విలువైన భూముల హక్కులను అక్రమంగా మార్చినట్లు వచ్చిన ఆరోపణలపై సీఐడి ప్రధానంగా ఆరా తీస్తోంది. దీనికితోడు భూదాన్ భూముల బైనంబర్లను ఆసరాగా చేసుకుని జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు, ఖాతాల మార్పిడులపై సుదీర్ఘంగా విచారణ జరుపుతున్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను పక్కదారి పట్టించి, ఎవరి లబ్ధి కోసం రికార్డులను మార్చారనే కోణంలో కీలక పత్రాలను పరిశీలిస్తున్నారు.

సీఐడీ డీజీ ఆదేశాలతో దాడులు

సీఐడీ డీజీ చారుసిన్హా నేతృత్వంలోని ప్రత్యేక విచారణ బృందం (SET) అందించిన నివేదిక ఆధారంగానే ఈ దాడులు చేపట్టారు. సాంకేతిక విశ్లేషణలో భాగంగా నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో కీలకమైన డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ లభించాయి. సిస్టమ్స్ లాగిన్ వివరాలు, డేటా ట్యాంపరింగ్ జరిగిన వేళలు, ఐపీ అడ్రస్ ఆధారంగా అక్రమార్కుల ముఠాను ఐడెంటిఫై చేసినట్లు సమాచారం.

Advertisement

Also Read: Intinti Ramayanam Today Episode: కమల్ దెబ్బతో పల్లవి షాక్.. పూజ పూర్తి.. పల్లవికి ఘోర అవమానం..

సూత్రధారులపైనే ప్రత్యేక దృష్టి

ఈ అక్రమాల్లో కేవలం ఆపరేటర్లు మాత్రమే కాకుండా వారి వెనుక ఉన్న అసలు సూత్రధారులు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల ప్రమేయంపై సీఐడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆపరేటర్లను పావులుగా వాడుకుని కోట్ల రూపాయల విలువైన భూములను దారిమళ్లించిన ప్రధాన కారకులను త్వరలోనే బయటకు తీస్తామని, అక్రమాలకు పాల్పడిన ఎంతటివారినైనా వదిలేదే లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: Nindu Noorella Saavasam Serial Today Episode November 7th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అమర్‌ అనుమానం నిజం అవుతుందా..? మనోహరి దొరికిపోతుందా..?

Tags

Related News

ప్రయాణికులకు దీపావళి ధమాకా.. భారీగా తగ్గిన మెట్రో, ఆర్టీసీ జాయింట్ పాస్‌ల ధరలు!

రూ.5 కోట్లు ఇస్తావా.. వీడియోలు బయట పెట్టమంటారా..? ఎమ్మెల్సీకి బెదిరింపులు.. సీన్ కట్ చేస్తే!

9 రోజులు.. 350 కి.మీ.. సీఎం రేవంత్‌ను కలిసిన అభిమాని

ఇది అతివృష్టి కాదు.. అనావృష్టి కాదు.. రేవంత్ వృష్టి! – హరీష్ రావు

చిట్టీల పేరిట రూ. 4 కోట్ల మోసం.. ప్రధాన నిందితుడు అరెస్ట్!

కేటీఆర్‌కు కాంగ్రెస్ ఓపెన్ ఛాలెంజ్.. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపించగలవా?

ముందు ఎమ్మెల్యేగా గెలువు.. ఆపై రాహుల్ గాంధీ మాట! జగ్గారెడ్డికి రఘునందన్ కౌంటర్

Big Stories

Advertisement
×