E-Paper
Advertisement

ఇది అతివృష్టి కాదు.. అనావృష్టి కాదు.. రేవంత్ వృష్టి! – హరీష్ రావు

ఇది అతివృష్టి కాదు.. అనావృష్టి కాదు.. రేవంత్ వృష్టి! – హరీష్ రావు
Advertisement

Harish Rao: తెలంగాణలో ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి కాలం తెచ్చిన కరువు కాదని, కేవలం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల వచ్చిన ‘రేవంత్ కరువు’ అని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం మెదక్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇది అతివృష్టి, అనావృష్టి కాదని.. నీటి నిర్వహణ చేతకాక వచ్చిన కరువు అని మండిపడ్డారు. ఈ రైతు వ్యతిరేక విధానాలపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.

చేతిలో నీళ్లున్నా.. జిల్లాలకు ఎండబెట్టడమేంటి?

Advertisement

రాష్ట్రంలో పుష్కలంగా అందుబాటులో ఉన్న నీళ్లను ఒడిసిపట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని హరీష్ రావు విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా 60 టీఎంసీల నీటిని తోడుకునే అవకాశం ఉన్నప్పటికీ, కేవలం 18 టీఎంసీలే ఎత్తారని చెప్పారు. 10 మోటార్లు నడవాల్సిన చోట 8 మాత్రమే నడిపారని, శ్రీశైలంలో నీళ్లున్నా కల్వకుర్తి ఎత్తిపోతలను పట్టించుకోకపోవడంతో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ నీటిని వాడుకుంటున్నారని ఆరోపించారు. సింగూర్‌లో 20 టీఎంసీల నీళ్లున్నా విడుదల చేయక సంగారెడ్డి, మెదక్ సహా నాలుగు జిల్లాల ప్రజలను తాగునీటి కష్టాల్లోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులకు పైసల్లేవు.. అందాల పోటీలకు వందల కోట్లా?

Advertisement

రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని అఖిలపక్షంలో ఒప్పుకున్న ప్రభుత్వం, కేబినెట్ సమావేశంలో మాత్రం రైతుల ఆదుకునే అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని హరీష్ రావు మండిపడ్డారు. ‘ఫ్యూచర్ సిటీకి లక్షల కోట్లు, ఢిల్లీకి కప్పం కట్టడానికి, అందాల పోటీలకు వందల కోట్లు ఇస్తున్న రేవంత్ రెడ్డికి.. రైతులను ఆదుకోవడానికి మాత్రం డబ్బులు లేవా?’ అని ప్రశ్నించారు. మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో ఎకరానికి రూ.5 వేల తక్షణ సాయం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఫేక్ మెసేజ్‌లు.. నెరవేరని హామీలు

రైతుబంధు జమ అయినట్లు రైతులకు మెసేజ్‌లు వస్తున్నాయని, కానీ బ్యాంకులకు వెళ్తే ఖాతాల్లో డబ్బులు ఉండటం లేదని హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి అంటే ‘కేర్ ఆఫ్ ఫేక్ మెసేజ్‌లు’ అని వ్యాఖ్యానించారు. సన్నధాన్యానికి ఇచ్చే బోనస్ ఎగ్గొట్టేందుకు 42 రకాల సన్నాలను 8 రకాలకే పరిమితం చేశారని, గన్నీ బ్యాగులు, రవాణా వసతి లేక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎండిపోతోందని అన్నారు. పంటలకు సెలవు ఇవ్వమని చెబుతున్న రేవంత్ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు శాశ్వతంగా సెలవు ప్రకటిస్తారని హరీష్ రావు హెచ్చరించారు.

Also Read: చిట్టీల పేరిట రూ. 4 కోట్ల మోసం.. ప్రధాన నిందితుడు అరెస్ట్!

Tags

Related News

9 రోజులు.. 350 కి.మీ.. సీఎం రేవంత్‌ను కలిసిన అభిమాని

చిట్టీల పేరిట రూ. 4 కోట్ల మోసం.. ప్రధాన నిందితుడు అరెస్ట్!

కేటీఆర్‌కు కాంగ్రెస్ ఓపెన్ ఛాలెంజ్.. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపించగలవా?

ముందు ఎమ్మెల్యేగా గెలువు.. ఆపై రాహుల్ గాంధీ మాట! జగ్గారెడ్డికి రఘునందన్ కౌంటర్

కామారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో పడి తండ్రీకూతురు మృతి

హైదరాబాద్‌వాసులకు దీపావళి కానుక.. సగానికి తగ్గిన కామన్ పాస్ ధరలు, శనివారం నుంచి అమలు

అమెరికాలో తెలుగు స్టూడెంట్ అదృశ్యం.. 36 గంటలకు గడిచినా తెలియని ఆచూకీ, లొకేషన్‌ బీచ్‌ ప్రాంతంలో

Big Stories

Advertisement
×