E-Paper
Advertisement

Tanveer Ahmed: అంతా దొంగాటే..డ్రింక్స్ బ్రేక్ లోనే వెస్టిండీస్ ప్లేయ‌ర్ల‌ను కొనేశారు, త‌న్వీర్ సంచ‌ల‌నం

Tanveer Ahmed: అంతా దొంగాటే..డ్రింక్స్ బ్రేక్ లోనే వెస్టిండీస్ ప్లేయ‌ర్ల‌ను కొనేశారు, త‌న్వీర్ సంచ‌ల‌నం
Advertisement

Tanveer Ahmed:  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో  ( T20 World Cup 2026 tournament )
టీమిండియా ( Team India) గెలిచిందంటే చాలు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మీద పడిపోతున్నారు. మ్యాచ్ గెలిస్తే మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ కారు కూతలు కూస్తున్నారు. ఇక పాకిస్తాన్ ఇంటికి వెళ్లి టీం ఇండియా సెమీఫైనల్ చేరుకున్న నేపథ్యంలో మరోసారి పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కారు. తాజాగా జరిగిన వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా ( India vs West Indies )  మ్యాచ్ పై పాకిస్తాన్ (Pakistan ) మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మ్యాచ్ కంప్లీట్ గా ఫిక్సింగ్ జరిగిందని బాంబు పేల్చారు. కావాలనే వెస్టిండీస్ బౌలర్లు బంతులు నెమ్మదిగా వేశారని, క్యాచులు వదిలేసారని ఆరోపణలు చేశారు తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ). మ్యాచ్ ఫిక్సింగ్ జరగడం వల్లనే టీమిండియా గెలిచిందని.. బీసీసీఐ ఇచ్చిన డబ్బులకు వెస్టిండీస్ ప్లేయర్లు అమ్ముడుపోయారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తన్వీర్ అహ్మ‌ద్‌. డ్రింక్స్ బ్రేక్ లోనే వెస్టిండీస్ ప్లేయ‌ర్ల‌ను కొనేశారని హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: India vs West Indies: సంజూ ర‌ఫా..ర‌ఫా, వెస్టిండీస్ పై 10 ఏళ్ల రివేంజ్ తీర్చుకున్న టీమిండియా…సెమీ ఫైనల్ లోకి ఎంట్రీ

వెస్టిండీస్ పై విజయం.. సెమీ ఫైనల్ లోకి ఇండియా ఎంట్రీ

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించింది టీమిండియా. వెస్టిండీస్ విధించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేదించింది టీమిండియా. 19.2 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ చేసింది. దీంతో వెస్టిండీస్ పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. అయితే ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది డేంజర్ ఆటగాడు సంజు శాంసన్. 97 పరుగులు చేసిన సంజు శాంసన్, జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో చాలా రోజుల నుంచి బాధపడుతున్న అతనికి.. ఈ మ్యాచ్ అద్భుత అవకాశాన్ని కల్పించింది. దీంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు సంజు. ఇక వెస్టిండీస్ పై విజయం సాధించిన టీమిండియా, సెమీఫైనల్ లో అడుగు పెట్టింది. మార్చి 5వ తేదీన టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ జరగనుంది.

డ్రింక్స్ బ్రేక్ లోనే వెస్టిండీస్ ప్లేయ‌ర్ల‌ను కొనేశారు

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్విర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ లో మొత్తం దొంగాట ఆడారని మండిపడ్డారు. డ్రింక్స్ సమయంలోనే వెస్టిండీస్ ప్లేయర్లను బీసీసీఐ కొనుగోలు చేసిందని ఆరోపణలు చేశారు. అందుకే టీమిండియా ఐదు వికెట్ల తేడాతో అవలీలగా గెలిచిందన్నారు. ఫిక్సింగ్ జరిగింది కాబట్టే ఫామ్ లో లేని సంజు శాంసన్ అద్భుతంగా రాణించాడని తెలిపారు.

Advertisement

Also Read: India vs West Indies: విండీస్ ఫ‌స్ట్ బ్యాటింగ్..ఐసీసీని ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ గా మార్చారు…విషం క‌క్కిన పాక్‌

 

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

డ్రెస్సింగ్ రూమ్ వైపు దొంగ చూపులు చూసి రివ్యూలు తీసుకునేవారు – పుజారా

గంగూలీ క్రికెట్ కు పనికిరాడంటూ మెయిల్…గ్రెగ్ చాపెల్ దిష్టిబొమ్మను దహనం చేసిన ఫ్యాన్స్

ఒరేయ్ నఖ్వీ… నీకు ఏది చేతకాదు కానీ, ఆసియా కప్ అయినా దొంగిలించు !

ఆస్ట్రేలియాకు వెళ్ళాక టీమిండియా నుంచి ధోని తరిమేశాడు..సెహ్వాగ్ సంచలనం !

వహాబ్ రియాజ్ కోచ్ కాదు…వాడు పెద్ద కామాంధుడు, డ్రెస్సింగ్ రూమ్ లోనూ వదలడు !

1980లో ప్రపంచ కప్.. రేడియోలోనే లైవ్, టీమిండియా సత్తాను ప్రపంచానికి చాటిన రోజులవి!

2011 వరల్డ్ కప్ సెమీస్‌ లో సచిన్ LBW అయినా, థర్డ్ అంపైర్ ఇవ్వలేదు

నన్ను ఫిక్సర్, దేశ ద్రోహి అంటూ గంభీర్ అవమానించాడు..శ్రీశాంత్ ఎమోషనల్

Big Stories

Advertisement
×