E-Paper
Advertisement

రూ.5 కోట్లు ఇస్తావా.. వీడియోలు బయట పెట్టమంటారా..? ఎమ్మెల్సీకి బెదిరింపులు.. సీన్ కట్ చేస్తే!

రూ.5 కోట్లు ఇస్తావా.. వీడియోలు బయట పెట్టమంటారా..? ఎమ్మెల్సీకి బెదిరింపులు.. సీన్ కట్ చేస్తే!
Advertisement

Deepfake Blackmail: సాంకేతికతను ఆసరాగా చేసుకుని అక్రమంగా డబ్బు సంపాదించాలనుకున్న ఒక ముఠా ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్సీనే లక్ష్యంగా చేసుకుంది. మార్ఫింగ్ ఫొటోలు, అభ్యంతరకరమైన డీప్‌ఫేక్ వీడియోలతో బెదిరింపులకు పాల్పడిన కేటుగాళ్ల ముఠాను సైబరాబాద్ పరిధిలోని నార్సింగి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

రూ. 5 కోట్ల డిమాండ్.. ఆపై బ్లాక్‌మెయిల్

Advertisement

తెలంగాణ ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ కుట్ర జరిగింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కి, త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దాదాపు 14 మంది కలిసి పథకం వేశారు. ఎమ్మెల్సీ రాజకీయ, సామాజిక ప్రతిష్ఠను దిగజారుస్తామని, ప్రాణాలు తీస్తామని భయపెడుతూ మొదట రూ. 5 కోట్లు డిమాండ్ చేశారు. ఒత్తిడికి గురిచేస్తూ ఇప్పటికే రూ. 5 లక్షలు వసూలు చేసిన నిందితులు, మరో రూ. 5 లక్షల కోసం మళ్లీ పట్టుబట్టారు.

అదే ఆఫీస్‌లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు

Advertisement

ఈ క్రమంలో ఫాతిమా బేగం అనే మహిళ మరో ఐదుగురితో కలిసి ఇబ్రహీంబాగ్‌లోని ఎమ్మెల్సీ కార్యాలయానికి వచ్చి నగదు తీసుకునేందుకు ప్రయత్నించింది. ఈ సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి రంగంలోకి దిగారు. బాధితుడి నుంచి నగదు తీసుకుని వెళ్తుండగా ఐదుగురిని పట్టుకున్నారు. అనంతరం వారి సమాచారంతో మహ్మద్ మొహ్సిన్ ఖాన్ అనే మరో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

సరుకు స్వాధీనం.. మిగతా వారి కోసం గాలింపు

అరెస్టు చేసిన నిందితుల నుంచి రూ. 4.70 లక్షల నగదుతో పాటు రెండు ఆటోలు, ఆరు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రధాన నిందితుడు (A-1) సహా మరికొందరు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Also Read: 9 రోజులు.. 350 కి.మీ.. సీఎం రేవంత్‌ను కలిసిన అభిమాని

Tags

Related News

9 రోజులు.. 350 కి.మీ.. సీఎం రేవంత్‌ను కలిసిన అభిమాని

ఇది అతివృష్టి కాదు.. అనావృష్టి కాదు.. రేవంత్ వృష్టి! – హరీష్ రావు

చిట్టీల పేరిట రూ. 4 కోట్ల మోసం.. ప్రధాన నిందితుడు అరెస్ట్!

కేటీఆర్‌కు కాంగ్రెస్ ఓపెన్ ఛాలెంజ్.. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపించగలవా?

ముందు ఎమ్మెల్యేగా గెలువు.. ఆపై రాహుల్ గాంధీ మాట! జగ్గారెడ్డికి రఘునందన్ కౌంటర్

కామారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో పడి తండ్రీకూతురు మృతి

హైదరాబాద్‌వాసులకు దీపావళి కానుక.. సగానికి తగ్గిన కామన్ పాస్ ధరలు, శనివారం నుంచి అమలు

Big Stories

Advertisement
×