E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Promo : నాగ్ ఎంట్రీ అదుర్స్..డ్యాన్స్ తో హౌస్ మెట్స్ సందడి.. భరణి పై ప్రశంసలు..

Bigg Boss 9 Telugu Promo : నాగ్ ఎంట్రీ అదుర్స్..డ్యాన్స్ తో హౌస్ మెట్స్ సందడి.. భరణి పై ప్రశంసలు..
Advertisement

Bigg Boss 9 Telugu Promo : ప్రస్తుతం ఎక్కడ చూసినా బిగ్ బాస్ మేనియా కొనసాగుతుంది.. మరి కొన్ని రోజుల్లో ఈ షో కి ముగింపు పడబోతున్న నేపథ్యంలో ఎవరు విన్నర్ అవుతారని జనాల్లో ఆసక్తి రోజుకి పెరుగుతుంది.. 12 వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అని ఆడియన్స్ వీకెండ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శనివారం ఎపిసోడ్ లో నాగ్ అందరిని ఒక ఆట ఆడుకున్నారు. హౌస్ లోని కంటెస్టెంట్స్ ను ఆడించారు.. ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ఉండబోతుందని తెలిసిందే.. మరి ఈ వీక్ డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ లోంచి ఎవరు బయటకు వెళ్తారో మరికొన్ని గంటల్లో తెలిసే అవకాశం ఉంది. ఇక తాజాగా బిగ్ బాస్ ఇవాళ ప్రోమోను ను రిలీజ్ చేసింది. ఆ ఫోటో హైలెట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం..

హైలెస్సా అంటూ మనసు దోచుకున్న నాగ్..

సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రసారమయ్యే ప్రతి ఎపిసోడ్లో హౌస్ మేట్స్ టాస్కుల పేరుతో కొట్టుకోవడం తిట్టుకోవడం చేస్తూ ఉంటారు.. కానీ వీకెండ్ ఎపిసోడ్లో మాత్రం నాగ్ ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తాడు.. అందుకే వీకెండ్ ఎపిసోడ్ కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. ఈ ఆదివారం ఎపిసోడ్ కి సంబంధించిన ఓ ప్రోమోను తాజాగా బిగ్ బాస్ రిలీజ్ చేశారు.. ఆ ప్రోమోలో ముందుగా నాగార్జున నాగచైతన్య నటించిన తండేల్ మూవీలో హైలెస్సా హైలెస్సా అనే పాటకి డాన్స్ వేశారు.. నాగార్జున ఎంట్రీ అదుర్స్ అంటూ ప్రోమో ని చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..

హౌస్ మెట్స్ తో ఆట…

Advertisement

నాగార్జున హౌస్ మేట్స్ అందర్నీ పలకరిస్తాడు.. అందరూ చాలా అందంగా ముస్తాబయ్యారు అని అంటారు. సుమన్ శెట్టి కాస్ట్యూమ్ ని చూసి అదరగొట్టేసావని నాగార్జున అంటాడు.. మీ అందరికీ ఒక టాస్క్ ఇస్తాను అని నాగార్జున అంటాడు. ఒక క్లిప్ చూపిస్తాను ఆ వీడియో కేవలం 60 సెకండ్లు మాత్రమే ఉంటుంది..దాన్ని చూసి సినిమాను కనిపెట్టాలని చెప్తాడు. రెండు టీములుగా ఉన్న వాళ్ళని గుర్తించమని చెప్తారు.. రెండు టీములు కూడా చాలా చక్కగా పెర్ఫార్మ్ చేస్తాయి. అన్ని సినిమాల పేర్లను చెప్తారు.. సినిమాల పేర్లు చెప్పిన తర్వాత ఆ సినిమాలోని పాటలతో హౌస్ మేట్స్ తో డాన్సులుగా ఇస్తాడు.. దివ్య సుమన్ శెట్టి 100% లవ్ మూవీ లోని పిల్లా నీ బావనిస్తావా పాటకి డాన్స్ చేస్తారు.. అదే హైలెట్ గా నిలుస్తుంది..

Also Read : చిరంజీవిని కలిసిన కష్టాలు తీరలేదా బాబాయ్.. కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేరు..

ఈ వీక్ బిగ్ బాస్ బెస్ట్ మూమెంట్.. 

Advertisement

సినిమాల పేర్లను గుర్తించడం అయిన తర్వాత.. భరణితో కాసేపు నాగార్జున ముచ్చటిస్తారు.. భరణి ఈ వారం హౌస్ లో బెస్ట్ మూమెంట్ ఏదో తెలుసా అని అంటాడు.. అదేంటో నేను వీడియో చూపిస్తాను చూడండి అని నాగ్ అంటారు.. ఆ వీడియో క్లిప్ లో భరణి, రీతు చౌదరి కలిసి డాన్స్ వేస్తున్న వీడియో బాగా వైరల్ అయిందని చెప్పడంతో పాటుగా నాగార్జున దాన్ని చూసి నవ్వుకుంటాడు.. మొత్తానికి ఇవాళ ఎపిసోడ్ కాస్త సరదాగా మొదలవుబోతుందని ప్రోమో ని చూస్తే తెలుస్తుంది.. ఇక ఈ వారం డేంజర్ లో ఉన్న సంజన, దివ్యలలో ఎవరు హౌస్ని వీడి బయటకు వెళ్లిపోతారో చూడాలి..

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×