E-Paper
Advertisement

Kavitha: తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే.. కేసీఆర్‌కు సిట్ నోటీసులపై కవిత సంచలన వ్యాఖ్యలు

Kavitha: తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే.. కేసీఆర్‌కు సిట్ నోటీసులపై కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ఉదంతం మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ (SIT) నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. ఈ నోటీసుల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం కావాలనే ఈ అంశాన్ని సాగదీస్తోందని..  విచారణలో చిత్తశుద్ధి లోపించిందని ఆమె విమర్శించారు.

కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో ప్రజలందరికీ అర్థమవుతోందని అన్నారు. రాజకీయంగా లబ్ధి పొందడానికే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక సీరియస్ అంశమని, కానీ ప్రస్తుత ప్రభుత్వం దీనిపై కేవలం కాలయాపన చేస్తోందే తప్ప, నిజా నిజాలను బయటపెట్టే దిశగా అడుగులు వేయడం లేదని అభిప్రాయపడ్డారు.

Advertisement

‘ఫోన్ ట్యాపింగ్ అనేది ఖచ్చితంగా బాధాకరమైన విషయం. వ్యక్తుల ప్రైవసీకి భంగం కలగడం అనేది ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదు. అయితే, ఈ కేసును త్వరగా కొలిక్కి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. విచారణను వేగవంతం చేసి, ఈ కేసును కంక్లూడ్ చేయాలి. కానీ ప్రభుత్వం వైఖరి చూస్తుంటే అసలు వారి ఉద్దేశం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు’ అని కవిత వ్యాఖ్యానించారు.

కేసు విచారణలో జరుగుతున్న ఆలస్యంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికే ఈ కేసును వాడుకుంటున్నారా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు. చివరగా, చట్టం తన పని తాను చేసుకుపోవాలని, ఒకవేళ నేరం రుజువైతే నేరస్తులు ఖచ్చితంగా పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, అది రాజకీయ కక్షసాధింపు చర్యగా మారకూడదని ఆమె హితవు పలికారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

Advertisement

ALSO READ: KTR: చావు నోట్లో తలపెట్టి రాష్ట్రం తెచ్చిన కేసీఆర్‌పై కక్షసాధింపా? ఫోన్ ట్యాపింగ్ నోటీసులపై కేటీఆర్ సంచలన ట్వీట్

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×