E-Paper
Advertisement

వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌కు ఒకే సబ్‌స్క్రిప్షన్.. Meta One వచ్చేసింది!

వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌కు ఒకే సబ్‌స్క్రిప్షన్.. Meta One వచ్చేసింది!
Advertisement

Meta One: వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మూడు యాప్స్‌ను రోజూ వాడేవాళ్లకు మెటా కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొచ్చింది. Meta One పేరుతో వచ్చిన ఈ ప్లాన్‌లో 3 యాప్స్‌కు సంబంధించిన ప్లస్ ఫీచర్లు ఒకే చోట దొరుకుతాయి. సాధారణ యూజర్ల కోసం కోర్, ప్రీమియం ప్లాన్‌లు ఉండగా.. బిజినెస్‌లు, కంటెంట్ క్రియేటర్ల కోసం మరో నాలుగు ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి.

ధర ఎంతంటే?

ఇండియాలో మెటా వన్ కోర్ ప్లాన్ నెలకు రూ.549గా ఉంది. ప్రీమియం ప్లాన్ ధర రూ.1,960. విడిగా చూస్తే వాట్సప్ ప్లస్ రూ.79, ఇన్‌స్టాగ్రామ్ ప్లస్, ఫేస్‌బుక్ ప్లస్ ఒక్కొక్కటి రూ.99గా ఉన్నాయి. అంటే మూడు సబ్‌స్క్రిప్షన్లను విడిగా తీసుకునే బదులు, ఒకే ప్లాన్‌లో వాటి ఫీచర్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. బిజినెస్, క్రియేటర్ ప్లాన్‌ల ధరలు కూడా వాటి ఫీచర్లను బట్టి మారుతాయి.

ఏం ఫీచర్లు వస్తాయి?

Advertisement

కోర్ ప్లాన్‌లో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ను కొత్త స్టైల్‌లో మార్చుకోవడం, వాయిస్ ఎఫెక్ట్స్ వంటి క్రియేటివ్ టూల్స్ ఉంటాయి. ముఖ్యంగా మెటా ఏఐతో ఇమేజీలు, వీడియోలు తయారు చేసుకునేందుకు ఎక్కువ వినియోగ పరిమితి లభిస్తుంది. ప్రీమియం ప్లాన్ తీసుకుంటే మెటా ఏఐ ఫీచర్లను ఉపయోగించుకునే లిమిట్ మరింత పెరుగుతుంది. అంటే ఏఐ టూల్స్‌ను ఎక్కువగా వాడేవాళ్లకు ఇది ఉపయోగపడేలా ఉంది.

Also Read: బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు.. Moto Buds 2 Fusion ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు!

బిజినెస్‌లకు ఏంటి?

Advertisement

బిజినెస్‌ల కోసం ఎసెన్షియల్ ప్లాన్ నెలకు రూ.639 నుంచి మొదలవుతుంది. ఇందులో వాట్సప్ బిజినెస్‌లో మెటా బిజినెస్ ఏజెంట్ ద్వారా కస్టమర్లకు స్పందించడం, వెరిఫైడ్ బ్యాడ్జ్, వెరిఫైడ్ ఛానల్, ఇంపర్సనేషన్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అడ్వాన్స్‌డ్ ప్లాన్ ధర రూ.2,099. ఇందులో స్టోరీస్‌ను ముందుగానే షెడ్యూల్ చేయడం, పోస్టులు, రీల్స్‌లో లింకులు, ఎక్స్‌పోర్ట్ చేసుకునే అనలిటిక్స్, ఆడియన్స్ వివరాలు వంటి టూల్స్ వస్తాయి.

క్రియేటర్లకు మరిన్ని టూల్స్:

ఎక్స్‌పర్ట్, మ్యాక్స్ ప్లాన్‌ల ధరలు వరుసగా రూ.6,399, రూ.20,990గా ఉన్నాయి. ఇవి మెటా బిజినెస్ ఏజెంట్‌కు మరిన్ని అధునాతన సదుపాయాలు అందిస్తాయి. మొత్తంగా చూస్తే.. మూడు యాప్స్‌లో ఏఐ, క్రియేటివ్ టూల్స్ లేదా బిజినెస్ ఫీచర్లను ఎక్కువగా వాడేవాళ్లను టార్గెట్ చేస్తూ Meta One తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. సాధారణంగా ఒక్కో యాప్‌కు విడిగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరాన్ని తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశంగా ఉంది.

ఏది తీసుకోవడం ఉత్తమం?

యూజర్లకు ఏది సరిపోతుందన్నది వారి అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఏఐతో తరచూ ఇమేజీలు, వీడియోలు తయారు చేసేవాళ్లు ప్రీమియం ప్లాన్‌లో లభించే అదనపు లిమిట్లను గమనించొచ్చు. అలాగే చిన్న వ్యాపారాలు, ఆన్‌లైన్‌లో కస్టమర్లతో ఎక్కువగా మాట్లాడే సంస్థలకు బిజినెస్ ప్లాన్‌లలోని ఆటోమేషన్ టూల్స్ ఉపయోగపడొచ్చు. అయితే నెలవారీ ఖర్చు పెరుగుతుంది కాబట్టి.. నిజంగా అవసరమైన ఫీచర్లు ఏవో చూసుకుని ప్లాన్ ఎంచుకోవడం మంచిది. మెటా మూడు యాప్స్‌ను ఒకే సబ్‌స్క్రిప్షన్‌లోకి తీసుకురావడం ఇదే మొదటిసారి కావడంతో, యూజర్లు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. అదే కీలక విషయం.

Also Read: ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల నుంచి టీవీల వరకు.. Flipkart Big Billion Days డేట్స్ వచ్చేశాయోచ్!

Tags

Related News

ఎవరైనా కెమెరా గ్లాసెస్ పెట్టుకుని మీకు దగ్గర్లో ఉంటే.. ఈ యాప్ ఇట్టే పసిగట్టేస్తుంది!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. రోజులు తరబడి టెన్షన్ ఫ్రీ

వాట్సాప్ చాట్స్ డిలీట్ చేయకుండా.. స్టోరేజ్ ఎలా ఖాళీ చేయాలి?

రూ.1500లోపు అదిరిపోయే ఇయర్ బడ్స్..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

రూ.500 లోపు.. బెస్ట్ ఉమెన్స్ వాచ్ మోడల్స్!

రోజుకు 3GB డేటా కావాలా? Airtelలో ఈ రెండే బెస్ట్ ప్లాన్స్.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సైతం ఉచితం!

ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల నుంచి టీవీల వరకు.. Flipkart Big Billion Days డేట్స్ వచ్చేశాయోచ్!

Big Stories

Advertisement
×