Big Stories

KCR Comments: కేసీఆర్.. ఆన్సర్ ప్లీజ్

KCR latest news today(Political news in telangana): గెలుపును ఆస్వాదించే లక్షణం ఉండాలి. ఓటమిని ఒప్పుకునే ధైర్యం ఉండాలి. ఓ రాజకీయ నేతకు ఉండాల్సిన లక్షణాలు ఇవి. కానీ మాజీ సీఎం కేసీఆర్‌కు ఇవీ ఉన్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే పుష్కర కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఆయన మాట్లాడిన మాటలు.. చేసిన విమర్శలు చూస్తే.. ఇదే అనుమానం వస్తుంది. అయితే కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి. అవేంటో చూద్దాం. బీఆర్ఎస్‌ ఓటమి తర్వాత ఎట్టకేలకు ఫామ్‌హౌస్‌ను వీడారు కేసీఆర్. ప్రజల్లోకి వెళుతున్నారు. అధికారపక్షంపై విమర్శల డోస్‌ను పెంచారు. ఎట్ ది సేమ్‌ టైమ్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇన్నీ చేస్తున్నా ఇప్పటికీ ఆయన చేయని ఒక పని ఉంది. అదే ఓటమిని అంగీకరించకపోవడం. ఇప్పటికీ బీఆర్ఎస్‌ ఓటమికి ప్రజల తప్పుడు నిర్ణయమే కారణమంటున్నారు. అంటే ఇంత జరిగాక కూడా ఆయనలో వీసమెంతు మార్పు రాలేదని క్లియర్‌ కట్‌గా అర్థమవుతుంది.

- Advertisement -

అయితే కొన్ని విషయాల్లో కేసీఆర్ ఇప్పటికీ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదు. అందులో ఫస్ట్ వచ్చే టాపిక్‌ కాళేశ్వరం ప్రాజెక్ట్. మేడిగడ్డ కుంగడానికి కారణమెవరు? అన్నారం బ్యారేజ్‌ లీక్‌కు బాధ్యులు ఎవరు? ఫోన్‌ ట్యాపింగ్‌ పాపం ఎవరిది? సంక్షేమ పథకాల అమలులో జరిగిన స్కామ్‌లకు బాధ్యులు ఎవరు? తెలంగాణ నష్టపోయేలా విద్యుత్ ఒప్పందాలు ఎందుకు చేసుకున్నారు? ఎమ్మెల్యేల అవినీతిని ఎందుకు అరికట్టలేకపోయారు? ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్ట్ అయ్యారన్నది నిజం కాదా? ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌తో పాటు పోలీస్‌ శాఖలో అతి ముఖ్యమైన పదవుల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులు ఎందుకు ఉన్నారు? రిటైర్‌ అయిన వారిని తీసుకొచ్చి మరి పగ్గాలు అప్పగించాల్సిన అవసరం ఏముంది? అకాల వర్షాల బాధితులను మీ హయాంలో ఆదుకున్నారా? 24 గంటల కరెంట్‌పై మీరు చెప్పిన, చెప్తున్న మాటల్లో నిజమెంత? ఇలాంటి క్వశ్చన్స్‌కు కేసీఆర్ సమాధానం ఇప్పటికీ చెప్పలేదు. నిజం చెప్పాలంటే అసలు ఈ ప్రశ్నలను అడిగే చాన్స్ ఎవ్వరికీ ఇవ్వడం లేదు.

- Advertisement -

Also Read: తెలంగాణలో వరుస ప్రమాదాలు.. ఒకరు సజీవదహనం, నలుగురు మృతి

కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలనైతే చెప్పారు కేసీఆర్.. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ట్యాపింగ్‌కు ప్రభుత్వానికి ఏం సంబంధం అని రివర్స్‌లో దబాయిస్తున్నారు. ఫోన్ ట్యాపింగుతో సీఎంకు, ప్రభుత్వానికి సంబంధం లేదంటున్నారు కేసీఆర్. అది కేవలం పోలీస్ డిపార్ట్‌మెంట్‌ ఇంటర్నల్ ఇష్యూ అని కొట్టిపారేస్తున్నారు. అంటే పోలీస్‌ డిపార్ట్‌మెంట్ అనేది సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతుందా? నేరస్థులను పోలీసులు ట్యాపింగ్ చేసే పట్టుకుంటారని కొత్త భాష్యం చెబుతున్నారు కేసీఆర్. అంటే ట్యాపింగ్ అనేది చట్ట విరుద్ధమని కేవలం మావోయిస్టులు, టెర్రరిస్టుల విషయాల్లో మాత్రమే అది ముందుగా అనుమతి తీసుకునే చేయాలన్న విషయం కూడా కేసీఆర్‌కు తెలియనట్టు కనిపిస్తుంది.

మరో హైలేట్ విషయం ఏంటంటే.. మేడిగడ్డ కుంగడం ఇంజనీర్ల తప్పవుతుంది కానీ  నా తప్పేలా అవుతుందని రివర్స్‌లో క్వశ్చన్ చేస్తున్నారు కేసీఆర్. కానీ గతంలో తానే దగ్గరుండి మరీ డిజైన్లు చేశానని గొప్పగా చెప్పుకున్న రోజులను కేసీఆర్ మర్చిపోయారేమో మరి అంతేకాదు ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ ప్రజలు మెచ్యూర్డ్‌గా ఆలోచించారు కాబట్టి బీఆర్ఎస్‌ను గెలిపించారు. గ్రామీణ ప్రజలు మోసపూరిత హామీల వలలో పడి తమను ఓడించారు. ఈ స్టేట్‌మెంట్ చూస్తే ఆయన ఇంకా డినయిల్ మోడ్‌లోనే ఉన్నారని అర్థమవుతుంది. లేదంటే ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు..? ఓ రకంగా చూస్తే ఇది గ్రామీణ ప్రజల తీర్పును అవమానించడమే అసలు ఓటమిని అంగీకరించకపోవడం అనేది పూర్తిగా ప్రజల తీర్పును అవమానించడమే అని చెప్పాలి.

కేసీఆర్‌పై ప్రజలకున్న నెగటివిటి సున్నా కావాలంటే చూడండి లోక్‌సభ ఎన్నికల్లో 8 నుంచి 10 సీట్లు వస్తాయి. ఇది ఎవరు చెప్పిన మాటో కాదు. ఆయనకు ఆయన ఇచ్చుకున్న స్టేట్‌మెంటే.. మరి అదే నిజమైతే మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోతారు? లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల కోసం ఇంతగా ఎందుకు కష్టపడాల్సి వస్తుంది? ఓవరాల్‌గా కేసీఆర్ వ్యవహారం చూస్తే.. చింత చచ్చినా.. పులుపు చావలేదు అన్నట్టుగా ఉంది. అంటే ఓటమికి గల విశ్లేషణలు జరగడం లేదు.నేతలు ఎందుకు వీడుతున్నారన్న దానిపై ఓ నిర్ణయానికి రావడం లేదు. కేవలం తెలంగాణ భవన్‌లో వాస్తు మార్చి బస్సు యాత్ర చేపట్టి.. ఎప్పటిలా కాంగ్రెస్‌పై విరుచుకపడితే గెలిచేస్తామన్న ధీమాలో ఉన్నారు కేసీఆర్. మరి కేసీఆర్‌ది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా? అనేది మరికొన్ని రోజుల్లోనే తేలిపోనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News