Big Stories

Bird Flu Outbreak : బర్డ్ ఫ్లూ కలకలం.. వేలాది కోళ్లు, పక్షులు చంపివేత

Bird Flu Outbreak in Jharkhand : జార్ఖండ్ లో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. రాష్ట్ర రాజధాని రాంచీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో రన్ అవుతున్న పౌల్ట్రీ ఫామ్ లో బర్డ్ ఫ్లూ, ఏవియన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో జార్ఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. హోత్వాలోని పౌల్ట్రీ ఫామ్ లో బర్డ్ ఫ్లూ కేసులు నిర్థారణ అవ్వడంతో అధికారులు చర్యలు చేపట్టారు. వేలాది కోళ్లతో పాటు.. 4 వేల పక్షుల్నీ చంపారు. అలాగే వందలాది గుడ్లను సైతం ధ్వంసం చేసినట్లు తెలిపారు.

- Advertisement -

రానున్న రోజుల్లో మరిన్ని కోళ్లను చంపి.. వాటి ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను ఫాలో అవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసేం వరకూ.. చికెన్ అమ్మకాలపై పూర్తిగా నిషేధం ఉంటుందని తెలిపింది.

- Advertisement -

Also Read : మనుషులకు వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ.. రెండో కేసు నమోదు.. నివారణ ఎలా..?

బర్డ్ ఫ్లూ వ్యాపించిన ప్రాంతానికి 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న ఇళ్లలో పక్షులు, గుడ్లు లభ్యత గురించి సర్వే చేస్తోంది. ఎక్కడైన పక్షులు, కోళ్లు కనిపిస్తే వెంటనే సమాచారమివ్వాలని రాష్ట్ర పశుసంవర్థక శాఖ ప్రజలను కోరింది. అలాగే బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ జార్ఖండ్ ప్రభుత్వానికి సూచించింది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు చికెన్ కు దూరంగా ఉండాలని పేర్కొంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News