BigTV English

KCR Comments on PM Modi: పాకిస్థాన్ పేరు చెప్పి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: కేసీఆర్

KCR Comments on PM Modi: పాకిస్థాన్ పేరు చెప్పి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: కేసీఆర్

PM Modi Black Mailing in the Name of Pakistan Said by KCR in Dundigal Road Show: ప్రధాని మోదీపై బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆయన నర్సాపూర్, పటాన్ చెరు, దుండిగల్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్నప్పుడు పుష్కలంగా మంచినీటి సరఫరా చేశామన్నారు. అదేవిధంగా విద్యుత్ కు అధిక ప్రాధాన్యతనిచ్చామన్నారు. తండాలను పంచాయతీలుగా మార్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్య్ వసూలు చేస్తున్నారని స్వయంగా ప్రధాని మోదీయే చెబుతున్నారన్నారు.


రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు 12 మంది బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. అదేవిధంగా మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, మెదక్ పార్లమెంటు స్థానాలను బీఆర్ఎస్ పక్కాగా కైవసం చేసుకోబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇటు బీజేపీపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. కేజ్రీవాల్, కవితలను రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారన్నారు. వారి అరెస్ట్ లపై అమెరికా కూడా నిరసన వ్యక్తం చేసిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విశ్వగురనని ప్రచారం చేసుకునే ప్రధాని మోదీ దేశ ప్రతిష్టను మంటగలుపుతున్నారన్నారు. పదేళ్ల కాలంలో మోదీ 150 నినాదాలు ఇస్తే.. అందులో ఒక్కటి కూడా అమలు చేసి చూపించలేదన్నారు. మోదీ ప్రభుత్వ పనితీరు వల్ల దేశంలో ఎగుమతులు తగ్గి, దిగుమతులు పెరిగాయన్నారు. విదేశీ మారక విలువ పడిపోయిందన్నారు. డాలర్ తో పోలీస్తే రూపాయి విలువ రూ. 84 కు పడిపోయిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


Also Read: మాట ఇస్తే తల తెగి కింద పడ్డా వెనక్కి తిరిగి చూడను: సీఎం రేవంత్ రెడ్డి

పాకిస్థాన్ పేరు చెప్పి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. ప్రజలారా జాగ్రత్తగా గమనించాలంటూ కేసీఆర్ పేర్కొన్నారు. 400 మెగావాట్ల సీలేరు పవర్ ప్రాజెక్టును ఆంధ్రకు కట్టబెట్టారంటూ మోదీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా గోదావరి, కృష్ణా జలాలను కర్ణాటక, తమిళనాడుకు తరలిస్తామని అంటున్నారని.. ఆ జలాలు తెలంగాణకు దక్కాలంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండంటూ ఆయన ప్రజలను కోరారు.

కాగా, నిజామాబాద్ లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి.. పీఎం మోదీ, కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ ఒకటే.. అందుకే కేసీఆర్ బీజేపీకి వత్తాసు పలుకుతున్నారని రేవంత్ పేర్కొన్న విషయం విధితమే. కేంద్రంలో మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకవచ్చేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. అదేవిధంగా కేసీఆర్ తన బిడ్డ కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ ఆత్మగౌరవాన్ని ప్రధాని మోదీ దగ్గర తాకట్టు పెట్టారని ఆయన పేర్కొన్న విషయం కూడా విధితమే.

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×