Big Stories

Hyderabad Police Seized Rs 3.16 Crores: హైదరాబాద్‌లో మూడు కోట్లకు పైగానే సీజ్.. బంగారం, వెండి ఆ వాహనంలో..

Hyderabad Police Seized Rs 3.16 Crores During the Elections 2024: ఎన్నికలకు కేవలం నాలుగురోజులు మాత్రమే మిగిలి ఉండడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నాలుగురోజుల్లో కోట్లలో డబ్బు మారే అవకాశం ఉందని భావించిన పోలీసులు, ఫ్లయింగ్ స్వ్కాడ్స్, అన్ని మార్గాలను జల్లెడపడుతున్నాయి. దీనికితోడు సమాచారం ఇచ్చేందుకు సీ విజిల్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఎన్నికల సంఘం.

- Advertisement -

తాజాగా హైదరాబాద్‌లో మూడు కోట్ల 16 లక్షల విలువ చేసే నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముఖ్యంగా సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు చేసిన తనిఖీల్లో ఈ మొత్తమంతా పట్టుబడింది. బాలానగర్, కూకట్‌పల్లి ఎస్ఓటీ పోలీసులు రామ్‌దేవ్ ఆసుపత్రి సమీపంలో తనిఖీ చేపట్టారు. బీవీసీ లాజిస్టిక్స్ వాహనంలో నాలుగు కేజీల బంగారం (రూ. 2,64,00,000), నాలుగు కేజీల వెండి (రూ. 2,80,000) సొత్తు బయటపడింది.

- Advertisement -

సరైన పత్రాలు లేకపోవడంతో వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఎన్నికల అధికారి కార్యాలయానికి తరలించారు. దీంతో రద్దీ ప్రాంతాల్లో పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పదంగా ఉన్న లగేజ్ బ్యాగులను తనిఖీలు చేస్తున్నారు. జిల్లాల చెక్ పోస్టుల నుంచి వచ్చే వాహనాలను అణువణువునా పరిశీలిస్తున్నారు.

Also Read: మాట ఇస్తే తల తెగి కింద పడ్డా వెనక్కి తిరిగి చూడను: సీఎం రేవంత్ రెడ్డి

ఒక్కసారి వెనక్కి వెళ్తే.. పది రోజుల కిందట అంటే ఏప్రిల్ 29న దాదాపు రెండు కోట్ల రూపాయలను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సీజ్ చేశారు పోలీసులు. ఎనిమిది ప్రాంతాల్లో దాదాపు కోటి 96 లక్షల రూపాయలను పట్టుకున్నారు. ఆ రోజు నుంచి భారీ వాహనాలతోపాటు కార్లపైనా నిఘా పెట్టి పదేపదే తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో డబ్బు పట్టుబడినట్టు కేంద్ర ఎన్నికల సంఘం స్వయంగా తెలిపింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నుంచి భారీగా డబ్బు, బంగారం, వెండి, డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ క్రమంలో తెలంగాణలో పోలీసులు అలర్టయ్యారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News