BigTV English

CM Revanth Reddy NZB Road Show: మాట ఇస్తే తల తెగి కింద పడ్డా వెనక్కి తిరిగి చూడను: సీఎం రేవంత్ రెడ్డి!

CM Revanth Reddy NZB Road Show: మాట ఇస్తే తల తెగి కింద పడ్డా వెనక్కి తిరిగి చూడను: సీఎం రేవంత్ రెడ్డి!

CM Revanth Reddy Comments on PM Modi, BRS in Nizamabad Road Show: ఒకసారి మాట ఇస్తే తలతెగి కింద పడ్డా తాను వెనక్కి తిరిగి చూడనని.. తనపై ఎన్ని కేసులు పెట్టినా తగ్గకుండా కొట్లాడా.. లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పోరాటం చేసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చానని.. పసుపు పంటకు మద్దతు ధర ఇచ్చే బాధ్యత తనదేనంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.


నిజామాబాద్ లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మక్కలు, సోయా, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాట ధర కల్పిస్తామని, వరికి రూ. 500 బోనస్ ఇస్తామంటూ ఆయన రైతులకు హామీ ఇచ్చారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు ప్రమాదంలో పడ్డాయని ఆయన అన్నారు. బీజేపీ నియంతృత్వ పాలనతో రాజ్యాంగాన్ని ఇష్టారాజ్యంగా మార్చాలని చూస్తున్నదని.. అలా మార్చుకుంటూ పోతే ప్రజాస్వామ్యం బ్రతుకుతుందా? అని ఆయన ప్రశ్నించారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న బీజేపీని గద్దె దించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

భద్రాచలంలో లేదా మరే ఇతర ఆలయంలోనైనా కల్యాణం అయినంకనే అక్షింతలు ఇస్తారు.. కానీ, అయోధ్య విగ్రహ ప్రతిష్ట పూజ కంటే 15 రోజుల ముందే అక్షింతలు ఎలా వచ్చాయి..? ఇలా చేయడమంటే హిందువులను, దేవుడిని మోసం చేయడం కాదా? అంటూ ఆయన అన్నారు. తాము హిందువులం కాదా.. ? పూజలు చేయడం లేదా..? దేవుడి గురించి పదే పదే బీజేపీ వాళ్లు మనకు చెప్పాలా? అని ఆయన ప్రశ్నించారు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలని ఆయన అన్నారు.


Also Read: తెలంగాణలో ఒకప్పటి హీరోయిన్ ప్రచారం

కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదని.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆయన అన్నారు. దేశం కోసం త్యాగం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకేమో 40 సీట్లు వస్తాయని, అదే బీజేపీకేమో 400 సీట్లు వస్తాయని అంటున్నారని.. ఈ మాటలతోనే స్పష్టంగా అర్థమవుతోంది.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ తన బిడ్డ కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ ఆత్మగౌరవాన్ని ప్రధాని మోదీ దగ్గర తాకట్టు పెట్టారన్నారు.

రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చినంక హామీలు నెరవేరుస్తున్నామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తీసుకరావడంతో కోట్లమంది ఆడబిడ్డలు ఆ పథకాన్ని వినియోగించుకుంటున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నిర్ణయం తీసుకున్నామన్నారు. అదేవిధంగా రూ. 500 లకే ఇస్తున్నామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామని ఆయన అన్నారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×