E-Paper
Advertisement

KCR Health Bulletin : కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ ఆరా.. హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్..

KCR Health Bulletin : కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ ఆరా.. హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్..
Advertisement

KCR Health Bulletin : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆసుపత్రి వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. కేసీఆర్‌ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందని తెలిపారు.ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. సీటీ స్కాన్ చేసి కేసీఆర్‌కు ఎడమ తుంటి విరిగినట్టు గుర్తించారు. ఎడమ తుంటి మార్పిడి చేయాలని వైద్యులు తేల్చారు.

ఫామ్‌హౌస్‌లో తెల్లవారుజాము రెండున్నర గంటల సమయంలో కేసీఆర్ బాత్రూమ్‌లో కాలుజారి పడిపోయారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన వెంటనే స్పందించిన ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ తో ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం కేసీఆర్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

Advertisement

మరోవైపు కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో యశోద ఆసుపత్రికి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ వెళ్లారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని సీఎం రేవంత్ కు రిజ్వీ వివరించారు.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×