E-Paper
Advertisement

KCR: కేసీఆర్ పేరుతో ‘పచ్చబొట్టు’.. చేతిపై చెరగని గుర్తు.. మంత్రి వీరాభిమానం..

KCR: కేసీఆర్ పేరుతో ‘పచ్చబొట్టు’.. చేతిపై చెరగని గుర్తు.. మంత్రి వీరాభిమానం..
Advertisement
kcr tattoo

KCR: మంత్రుల్లో సత్యవతి రాథోడ్ సంథింగ్ డిఫరెంట్. సీఎం కేసీఆర్ అంటే విపరీతమైన అభిమానం. ఎంతంటే.. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యే వరకూ తాను చెప్పులు వేసుకోనంటూ గతంలో శపథం చేశారు. చెప్పినట్టే చాన్నాళ్లుగా ఆమె చెప్పులు లేకుండానే తిరుగుతున్నారు. మారుమూల నాయకురాలైన తనను.. ఎమ్మెల్సీని చేసి, మంత్రి పదవి కట్టబెట్టారనే అభిమానమే ఆమెతో ఇలాంటి పనులు చేయిస్తున్నట్టుంది. లేటెస్ట్‌గా మరో అనూహ్యం నిర్ణయం తీసుకున్నారు మంత్రి సత్యవతి రాథోడ్.

తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా హైదరాబాద్ బంజారాభవన్‌లో సాంస్కృతికోత్సవాలు జరుగుతున్నాయి. మంత్రి సత్యవతి ఆ కార్యక్రమానికి విచ్చేసి.. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ చూస్తున్నారు. అంతలోనే ఆమెకు ఓ చోట బంజారా స్టైల్ పచ్చబొట్టు స్టాల్ కనిపించింది. వెంటనే ఓ నిర్ణయం తీసుకున్నారు. తన కుడిచేతిపై.. పెద్ద పెద్ద అక్షరాలతో.. KCR అని పచ్చబొట్టు పొడిపించుకున్నారు.

Advertisement

ఆ సమయంలో అక్కడే ఉన్న అధికారులు, గిరిజన సంఘాల నేతలు మంత్రిని వారించారు. మేడమ్ చాలా పచ్చబొట్టు పొడుస్తుంటే చాలా నొప్పిగా ఉంటుంది.. మీరు భరించలేరు.. వద్దంటూ అడ్డుచెప్పబోయారు. కానీ, మంత్రి వినలేదు. కేసీఆర్ తనకు దైవసమానులని, ఊపిరి ఉన్నంత వరకు ఆయన చేసిన మేలు మర్చిపోలేనని చెబుతూ.. కేసీఆర్ పేరుతో ‘టాటూ’ వేయించుకున్నారు. ఇదీ సంగతి.

అప్పుడు చెప్పులు.. ఇప్పుడు పచ్చబొట్టు. ఈసారి బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే.. సత్యవతి రాథోడ్‌కు మళ్లీ మంత్రి పదవి పక్కా.. అని చర్చించుకుంటున్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×