BigTV English

KCR new plan: కేసీఆర్ కొత్త ప్లాన్.. సబిత‌కు కీలక పోస్టుపై..

KCR new plan: కేసీఆర్ కొత్త ప్లాన్.. సబిత‌కు కీలక పోస్టుపై..

KCR new plan: తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు ఆసక్తిగా గమనిస్తున్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. అసెంబ్లీలో జరుగుతున్న రగడపై దృష్టి సారించారు. తమ పార్టీ తరపున సభలో మహిళ కీలక పదవిలో ఉంటే మాట్లాడే ఛాన్స్ ఇస్తారని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.


తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మూడు,నాలుగు రోజులు సీఎం రేవంత్‌రెడ్డి వర్సెస్ సబిత ఇంద్రారెడ్డి అన్నచందంగా మారింది. ఈ నేతలిద్దరి మధ్య అంతర్గత విషయాలు సభా వేదికగా బయటపడ్డాయి. ఆ విషయం అందరికీ తెల్సిందే. మాట్లాడేందుకు తనకు మైక్ ఇవ్వలేదంటూ సబిత పదేపదే చెప్పుకొచ్చారు. అయినా ప్రభుత్వం చెప్పాల్సింది చెప్పింది. అసెంబ్లీ జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా గమనించారు కేసీఆర్.

మరోవైపు ఎస్సీల వర్గీకరణ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పును రాజకీయ నేతల స్పందన గమనించారు కేసీఆర్. ప్రస్తుతం నియామకాల నుంచి ఎస్సీ వర్గీకరణ చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ లో వెల్లడించారు. అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఇదే సభలో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలంటూ శాసనసభలో వాయిదా తీర్మానాన్ని కాంగ్రెస్ పెట్టింది. కొందరు ఎమ్మెల్యేలను సైతం అప్పటి ప్రభుత్వం బహిష్కరించిన విషయం తెల్సిందే.


ALSO READ: సీఎం రేవంత్‌కు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మధ్య బంధుత్వం ఉంది

రాష్ట్రంలో రాజకీయంగా జరుగుతున్న పరిణామాలను గమనించిన కేసీఆర్.. సబిత ఇంద్రారెడ్డికి సభలో కీలక పదవి ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎంను ఎదుర్కోవాలంటే ఆమె రైట్ పర్సన్ అని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

అదే జరిగితే కేటీఆర్, హరీష్‌రావు మాటేంటన్న దానిపై మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరికి ఆ పదవి ఇచ్చినా విభేదాలు వస్తాయని, సబిత ఇస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారట. దీనిపై సభ్యు లందరి అభిప్రాయాలను తీసుకోవాలని అనుకున్నారంట గులాబీ బాస్. మరి కేసీఆర్ మదిలో ఏముందో?

Related News

Hyderabad rains update: హైదరాబాద్ వర్షాల అలర్ట్.. మరికొద్ది గంటల్లో దంచుడే.. బయటికి వెళ్లొద్దు!

Telangana floods: 48 గంటల్లో 1,646 ప్రాణాలు సేఫ్.. ఈ అధికారులకు సెల్యూట్ కొట్టాల్సిందే!

Telangana floods: మీ రహదారులకు గండి పడిందా? రోడ్లు దెబ్బతిన్నాయా? వెంటనే ఇలా చేయండి!

Telangana Police: కుళ్లిన శవాన్ని మోసిన పోలీస్ అధికారి.. తెలంగాణలో హృదయాన్ని తాకిన ఘటన!

Telangana rains: భారీ వర్షాల దెబ్బ.. తెలంగాణలో భారీగా అంగన్వాడీ భవనాలకు నష్టం!

Vinayaka Chavithi: వినాయకుని పూజ కోసం రచ్చ.. ఏకంగా పూజారినే ఎత్తుకెళ్లారు!

Big Stories

×