BigTV English
Advertisement

Jagan again Bangalore: మళ్లీ బెంగుళూరు జగన్.. యలహంక ప్యాలెస్‌లో ఏం జరుగుతోంది?

Jagan again Bangalore: మళ్లీ బెంగుళూరు జగన్.. యలహంక ప్యాలెస్‌లో ఏం జరుగుతోంది?

YS Jagan latest news in telugu(Andhra news today): వైసీపీ అధినేత జగన్ మళ్లీ బెంగుళూరు వెళ్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా బెంగుళూరు వెళ్లనున్నారు. అక్కడి నుంచి యలహంకలోని తన ప్యాలెస్‌కు వెళ్లనున్నారు.


వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మళ్లీ బెంగుళూరుకు ప్లాన్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు గన్నవరం నుంచి విమానంలో నేరుగా బెంగుళూరు వెళ్లనున్నారు. జగన్, ఆయన సతీమణి భారతి గురువారం విజయవాడ పాస్‌పోర్టు ఆఫీసుకు వచ్చారు.సాయంత్రం పాస్‌పోర్టును రెన్యువల్ చేయించుకుని తిరిగి వెళ్లిపోయారు. దీంతో ఆయన ఫారెన్ టూర్‌కి వెళ్తున్నారా అన్న సందేహాలు అప్పుడు మొదలయ్యాయి.

జగన్ వ్యాపారాలు అన్నీ బెంగుళూరులోనే ఉన్నాయని అంటున్నారు. ఆ వ్యవహారాలు చక్కబెట్టేందుకు అక్కడికి వెళ్తున్నారని చెబుతున్నారు. గడిచిన రెండురోజులు కార్యకర్తల పేరిట తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రజా దర్బార్ నిర్వహించారు. చాలామంది తమ సమస్యలను విన్నవించుకున్నారు. వారి నుంచి అన్ని విషయాలు తెలుసుకున్న జగన్.. కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉంటే బెటరని ఆలోచనకు వచ్చినట్టు ఆ పార్టీలో వార్తలు జోరందుకున్నాయి.


ALSO READ: జగన్ పరిస్థితి ఏంటి, వెంకట్‌రెడ్డి ఎక్కడ? రంగంలోకి ఏసీబీ..

గురువారం పార్టీలోని కీలక నేతలకు సూచనలు, సలహాలు అధినేత జగన్ ఇచ్చినట్టు సమాచారం. అధికార పక్షాన్ని ధీటుగా ఎలా ఎదుర్కోవాలో చెప్పినట్టు తెలుస్తోంది. కొద్దిరోజులు తాను బెంగుళూరులో ఉంటానన్న విషయాన్ని బయటపెట్టారట జగన్. మిగతా కార్యక్రమాలు అందరూ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని సలహా ఇచ్చారట.

దీంతో యలహంక ప్యాలెస్‌లో ఏం జరుగుతోంది? అక్కడి అధికార-విపక్షాల నేతలను కలుస్తున్నారా? ఫ్యూచర్ రాజకీయాలకు అక్కడి నుంచే స్కెచ్ వేయనున్నారా? ఇలా రకరకాల ప్రశ్నలు వైసీపీ కార్యకర్తలను వెంటాడుతున్నాయి.

Related News

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Big Stories

×