BRS Politics: షెడ్ నుంచి కారు మళ్లీ ఎప్పుడు బయటకు వస్తుంది? బీఆర్ఎస్ అస్త్రాలు విఫలం అవుతున్నాయా? ఓ వైపు కేటీఆర్.. ఇంకోవైపు హరీష్‌రావు ఇప్పుడు కేసీఆర్ వంతైందా? నేతలు విసిరిన అస్త్రాలపై ఆ పార్టీ నేతలు ఏమంటున్నారు? ప్రజల ముందుకు ఏ విధంగా వెళ్లాలని ఆలోచన చేస్తున్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
కేసీఆర్ అస్త్రాలు తుస్సుమన్నాయా?
తెలంగాణలో అధికారం పోయిన తర్వాత ఫామ్ హౌస్‌కి పరిమితమయ్యారు మాజీ సీఎం కేసీఆర్. సరిగ్గా రెండేళ్ల తర్వాత మీడియా ముందు కొచ్చారు. గంటలకు పైగానే వివిధ అంశాలపై మాట్లాడారు. ఈసారి ‘వన్ షార్ట్ టూ బర్డ్స్’ ఫార్ములా అస్త్రాన్ని ప్రయోగించారు. అందులో ఒక్కటి మాత్రమే యాక్టివ్ అయ్యింది. మిగతా రెండు అస్త్రాలు ఫెయిల్ అయ్యాయి.
ఉన్నట్లుండి కేసీఆర్ అస్త్రాలు ఈ విధంగా ఫెయిల్ కావడంతో ఆ పార్టీ నేతలు ఆలోచనలో పడ్డారు. తొలుత ప్రధాని మోదీని టార్గెట్ చేశారు కేసీఆర్. ఇటీవల ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటు హాలులో ప్రధాని మోదీని కలిసి సందర్భంలో కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అది జరిగిన రెండు రోజులకు మీడియా ముందుకొచ్చారు కేసీఆర్.
మూడు నెలల తర్వాత ఫ్యూచర్ ప్లానేంటి?
తాను ఫిట్‌గానే ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టినా అటువైపు కనీసం స్పందన రాలేదు. అదే ఊపులో ఏపీ సీఎం చంద్రబాబుపై అలాంటి అస్త్రాలు ప్రయోగించారు. ఆ పార్టీ నుంచి ఒక్కరో ఇద్దరు మంత్రులు మాత్రమే స్పందించారు. ఆ వైపు నుంచి పెద్దగా రియాక్షన్స్ రాలేదు.
ఇక మూడోది కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెతిపోశారు. ఈ విషయంలో రెండురోజుల పాటు మంత్రులు కౌంటరిచ్చారు. ఆపై కేసీఆర్ మాటలను ఎంగడట్టారు. కేసీఆర్ వేసిన ప్రతీ ప్రశ్నకు అసెంబ్లీలో సమాధానం ఇస్తామని, ఆయన రావాలని కౌంటర్ ఇచ్చారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు.
సీన్ కట్ చేస్తే.. కేసీఆర్ మీడియా సమావేశాల ఆ తర్వాత జరిగిన పరిణామాలపై కారు పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకోవడం మొదలైంది. ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడితే అన్నివర్గాల నుంచి రియాక్షన్ వచ్చిన సందర్భాలు ఉండేవని, ఇప్పుడు అలాంటిది లేదని అనుకోవడం మొదలైంది. ఎందుకు పెద్దాయన ప్లాన్ ఫెయిల్ అయ్యిందని అంటున్నారు.
ALSO READ: వేగంగా మేడారం జాతర పనులు, డ్రోన్ విజువల్స్
కేసీఆర్ మూడు జిల్లాలకు వాటర్ బాంబు ప్లాన్ చేశారని అంటున్నారు. ఈ క్రమంలో పాలమూరు-రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఎత్తుకోవడం వెనుక అసలు ఉద్దేశమని అంటున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ప్రత్యేకంగా ఆ మూడు జిల్లాలు చాలా కీలకం. రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను కేసీఆర్ టార్గెట్ చేసినట్టు ఆ పార్టీ నేతల మాట. దీనికి సంబంధించిన ఫలితాలు త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కనిపిస్తాయని అంటున్నారు. ఇక హైదరాబాద్ సిటీలో కేడర్ చెదిరిపోలేదని, ఇంకా బలంగా ఉన్నామని ఆ పార్టీ నేతల అంచనా. ఆ లెక్కన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అస్త్రాలు సక్సెస్ అయ్యాయా? లేవా అనేది తేలనుంది. ఒకవేళ కనెక్ట్ కాకపోతే కొత్త ప్లాన్ రెడీ చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.