
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు అసెంబ్లీకి వెళ్లనున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన అసెంబ్లీకి వెళ్తారు. 12 గంటల 45 నిమిషాలకు అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్ లో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. నేరుగా అసెంబ్లీలోని ఎల్ఓపీ కార్యాలయం చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఎల్ఓపి నేతగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఎన్నికల ఫలితాల తర్వాత ఇంట్లో కాలు జారి పడిపోయిన కేసీఆర్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు తుంటి ఆపరేషన్ చేశారు. దీంతో వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకున్నారు. అందుకే, తొలి విడత అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేకపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుట పడటంతో అసెంబ్లీకి రానున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఇటీవల ఈ విషయాన్ని చెప్పారు. ఫిబ్రవరిలో పులి బయటకు వస్తుందని కేటీఆర్ తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే.. ఫిబ్రవరి ఒకటో తేదీనే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లనున్నారు.