BigTV English

H1B Visa New Rules : 2025 హెచ్1బీ వీసాల రిజిస్ట్రేషన్లు.. కొత్త నిబంధనలు ఇవే..

H1B Visa New Rules : 2025 హెచ్1బీ వీసాల రిజిస్ట్రేషన్లు.. కొత్త నిబంధనలు ఇవే..
today news paper telugu

H1B Visa New Rules(today news paper telugu) : హెచ్1బీ వీసా (H1B Visa)ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు అగ్రరాజ్యం నడుం బిగించింది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను జారీ చేసే వీసాల ఎంపిక ప్రక్రియకు కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇకపై ఒక వ్యక్తి.. ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా.. ఒకే అప్లికేషన్ గా పరిగణించనున్నారు. రిజిస్ట్రేషన్ల సంఖ్యతో సంబంధం లేకుండా.. దరఖాస్తులు చేసుకున్నవారందరికీ సమానంగా అవకాశాలను కల్పించేందుకు కేంద్రీకృత-ఎంపిక ప్రక్రియ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (USCIS) తెలిపింది. ఈ నిబంధనలను 2025 ఆర్థిక సంవత్సరానికి మొదదలయ్యే వీసాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అమలు చేయనున్నారు.


ప్రతి లబ్ధిదారు.. సరైన పాస్ పోర్టు వివరాలు, ప్రయాణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి. తప్పుడు సమాచారం ఇస్తే.. ఆ పిటిషన్లను రిజెక్ట్ చేయడం లేదా డిస్మిస్ చేసే అధికారం USCISకు ఉంటుంది. అలాగే పాస్ పోర్టు, ఇతర గుర్తింపు వివరాల ఆధారంగా దరఖాస్తుదారుడి రిజిస్ట్రేషన్ ను పరిగణలోకి తీసుకుంటారు.

2025 హెచ్1బీ వీసాల కోసం మొదటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 6 నుంచి మొదలై మార్చి 22 వరకూ జరుగుతుంది. ఈ వ్యవధిలో పిటిషనర్లు, సంస్థలు.. రిజిస్ట్రేషన్, దరఖాస్తు ఫీజు చెల్లింపుల కోసం తప్పనిసరిగా USCIS ఆన్ లైన్ అకౌంట్ ను వాడాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి కంపెనీలు.. వినియోగదారులు అకౌంట్లను తెరుచుకునేందుకు అనుమతివ్వనున్నాయి. ఫామ్ ఐ-129, నాన్ క్యాప్ హెచ్ 1 బీ పిటిషన్ల కోసం ఫామ్ ఐ-907 పత్రాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని USCIS వెల్లడించింది.


Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×