
MLC Kavitha : జగిత్యాల జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలలో.. బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ కు మద్దతుగా.. ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. డీహైడ్రేషన్ కారణంగా కవిత అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ప్రచార వాహనంపై నిలబడి కవిత మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయారు. వెంటనే అక్కడున్న మహిళా నాయకులు, పార్టీ శ్రాణులు కవితను వాహనంలోనే పడుకోబెట్టి మంచినీళ్లందించారు.
కొద్దిసేపటి తర్వాత మళ్లీ ప్రచారంలో పాల్గొని.. ప్రసంగించారు. బీఆర్ఎస్ తోనే తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ గెలిస్తే ప్రజలు గెలుస్తారని, బీజేపీ గెలిస్తే ఎవరికీ లాభం ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ రాకముందు పరిస్థితి ఎలా ఉందో.. ఇప్పుడెలా ఉందో గమనించాలని సూచించారు. పదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో వ్యవసాయానికి పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందని, రాష్ట్రం ధాన్యపు భాండాగారంగా మారిందన్నారు. కేంద్రంలో బీజేపీ విపరీతంగా పెంచిన గ్యాస్ సిలిండర్ ను.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సబ్సిడీతో రూ.400కే అందించాలని కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు.
RaghunandanRao: 100 కోట్లు ఇస్తే దున్నేస్తా.. పుస్తెలమ్మి బండి సంజయ్ పోటీ.. ఢిల్లీలో రఘునందన్ ధూంధాం..