E-Paper
Advertisement

ఖమ్మంలో పోలీసుల మెరుపు దాడి.. 324 కిలోల గంజాయి సీజ్!

ఖమ్మంలో పోలీసుల మెరుపు దాడి.. 324 కిలోల గంజాయి సీజ్!
Advertisement

Ganja Seizure: ఖమ్మం జిల్లాలో మరోసారి భారీగా గంజాయి తీవ్ర కలకలం రేపింది. కూసుమంచి మండలం జీళ్లచెరువు వద్ద పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఏకంగా 324 కిలోల గంజాయి చిక్కింది.

పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు..

Advertisement

రోడ్డుపై వెళ్తున్న ఒక వాహనంపై అనుమానం రావడం, ముందే అందిన పక్కా సమాచారంతో కూసుమంచి పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జీళ్లచెరువు వద్ద సదరు వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేయగా, అందులో దాచిన ఈ భారీ గంజాయి నిల్వలు బయటపడ్డాయి. పోలీసులు వెంటనే ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని, వాహనంలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

గంజాయి వ్యాపారులతో బలమైన సంబంధాలు..

Advertisement

పోలీసుల ప్రాథమిక విచారణలో పలు ఆసక్తికర, సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ ముఠాకు రాజమండ్రి, బెంగళూరులతో పాటు ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లోని గంజాయి వ్యాపారులతో బలమైన సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఆయా ప్రాంతాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని సేకరించి, ఇతర రాష్ట్రాలు, నగరాలకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.

అదుపులోకి నిందితులు..

ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న నిందితులను పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. గంజాయి రవాణా వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్ ఏంటి? దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? అన్న కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిస్థాయి పంచనామా పూర్తయిన తర్వాత, స్వాధీనం చేసుకున్న గంజాయి విలువతో పాటు నిందితుల వివరాలను మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

Also Read: జీతాలైతే తీసుకుంటున్నారు.. ఆదాయమేది? ఐఏఎస్‌లపై సర్కార్ ఆగ్రహం!

Tags

Related News

తెలంగాణ అమ్మాయిలకు బంపరాఫర్.. ఉచిత పైలట్ ట్రైనింగ్, ఇంకెందుకు ఆలస్యం

హైడ్రా బాస్ సంతకానికే ఎసరు.. ఏకంగా రంగనాథ్ పేరుతో నకిలీ NOCలు, 8 కాలేజీలపై కేసు!

మంత్రుల పేషీల్లో ‘షాడో’ లీడర్లు.. CCTV కెమెరాల్లో దొరికిపోయిన ‘పైరవీ’ నేతలు!

జీతాలైతే తీసుకుంటున్నారు.. ఆదాయమేది? ఐఏఎస్‌లపై సర్కార్ ఆగ్రహం!

ప్రభుత్వ జీతం.. సొంత వ్యాపారం.. టీచర్ల భాగోతంపై ‘బిగ్ టీవీ’ ఎక్స్‌క్లూజివ్!

పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. నియామక ప్రక్రియపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం!

హస్తినలో సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ హైకమాండ్-కేంద్ర మంత్రులతో కీలక భేటీలు

Big Stories

Advertisement
×