Miss Telangana: స్వేచ్చ బ్యూరో: మిస్ తెలంగాణ-2026, మిస్ ఖమ్మం-2026 టైటిళ్లను సాధించిన కొత్త లీలా ప్రసన్నను ఖమ్మం గాంధీచౌక్‌లోని సాయిబాబా ఆలయంలో మాజీ ఎమ్మెల్యే డా. బి. చంద్రావతి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. తెలంగాణ ఫ్యాషన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా హనుమకొండలోని కేఎల్ఎన్ కన్వెన్షన్‌లో జరిగిన అందాల పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచిన కొత్త లీలా ప్రసన్నను పలువురు అభినందించారు.
ఈ సందర్భంగా డా. బి. చంద్రావతి మాట్లాడుతూ.. లీలా ప్రసన్న సాధించిన విజయం ఇతర యువతులకు స్ఫూర్తిదాయకమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలన్నారు. యువతులు విద్య, కళలు, క్రీడలు, ఫ్యాషన్ సహా అన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో వేములపల్లి వెంకటేశ్వరరావు, కురువెళ్ల జగన్, ఎ. నిరంజన్, జి. నాగేశ్వరరావు, కె. సూర్యనారాయణ తదితరులు పాల్గొని లీలా ప్రసన్నను అభినందించారు.
Also read: ఎప్పటికీ నువ్వే నా సూపర్ స్టార్… తండ్రిని గుర్తు చేసుకుంటూ మహేష్ ఎమోషనల్!