E-Paper
Advertisement

జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగంలో.. లంచాల దందా కలకలం!

జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగంలో.. లంచాల దందా కలకలం!
Advertisement

GHMC Sanitation: స్వేచ్చ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన జీహెచ్ఎంసీలో ఎన్ని ఆధునిక సంస్కరణలు తీసుకువచ్చినా, శానిటేషన్ వింగ్ పని తీరు మారటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రతి రోజు తెల్లవారే కల్లా మెయిన్ రోడ్లు, సబ్ రోడ్లు, కాలనీ రోడ్లను శుభ్రపరిచే ఈ వింగ్‌లో సుమారు 16 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు, మరో వెయ్యికి పై చిలుకు శానిటరీ ఫీల్డు అసిస్టెంట్లు (ఎస్ఎఫ్ఏ)లు ఔట్ సోర్స్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు.

ఔట్ సోర్స్ ఉద్యోగులు..

వీరిలో కొంత మంది పర్మినెంట్ ఉద్యోగులున్నా, వారి కంటే కూడా ఔట్ సోర్స్ ఉద్యోగులు మెరుగుగా విధులు నిర్వహిస్తుంటారు. శానిటేషన్ కార్మికుల్లో నూటికి తొంభై శాతం మంది నిరక్షరాస్యులు కావటంతో వీరి పని తీరును పర్యవేక్షించే శానిటరీ ఫీల్డు అసిస్టెంట్లు, మెడికల్ ఆఫీసర్లతో పాటు డిప్యూటీ కమిషనర్లు వీరిని తప్పు దోవ పట్టిస్తూ అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. కానీ ముషీరాబాద్ సర్కిల్ లో సర్కిల్ స్థాయి అధికారులు కుమ్మక్కై ఖాళీగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ ఫీల్డు అసిస్టెంట్ ఉద్యోగాలను అడ్డదారిలో నియామకం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పారిశుద్ధ్య కార్మికులి స్థానంలో..

Advertisement

నిబంధనల ప్రకారం ఔట్ సోర్స్ శానిటరీ వర్కర్ అధికారులకు ఎలాంటి సమాచారమివ్వకుండా కంటిన్యూగా వంద రోజులు గైర్హాజరైతే వివరణ కోరి, సంతృప్తి కరంగా లేని పక్షంలో విధుల నుంచి తొలగించటం, లేక సదరు పారిశుద్ధ్య కార్మికులి స్థానంలో వారి కుటుంబ సభ్యులు విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాల్సి ఉంది. కానీ ముషీరాబాద్ సర్కిల్ లో సర్కిల్ స్థాయి అధికారులతో పాటు మెడికల్ ఆఫీసర్లు, శానిటేషన్ ఫీల్డు అసిస్టెంట్లు కుమ్మక్కై విధులకు రాని వారికి కూడా జీతాలు క్లెయిమ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ రకమైన అక్రమాలు జరగటాన్ని గుర్తించిన అధికారులు కొంతకాలం క్రితం ఫేస్ రికగ్నెజ్డ్ సిస్టమ్ అటెండెన్స్ పద్దతిని తీసుకువచ్చారు. కానీ సర్కిల్ స్థాయి అధికారులు, మెడికల్ ఆఫీసర్లు కుమ్మక్కై విధులకు హాజరు కాని కార్మికుల ఫేస్ రికగ్నెజ్డ్ అటెండెన్స్ తీసుకుని జీతాలు క్లెయిమ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

Also read: జియో బంపరాఫర్.. రూ.649 కే అపరిమిత 5G, హాట్‌స్టార్.. గూగుల్ జెమిని, కాన్వా ప్రో సైతం ఫ్రీ!

ఇదేం దందా?

Advertisement

ముషీరాబాద్ సర్కిల్ లో వరుసగా మూడు నెలల పాటు విధులకు హాజరు కాని ఓ పారిశుద్ధ్య కార్మికుడిని విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. అదే వరుసగా ఎనిమిది నెలలు విధులకు హాజరు కాని మరో ఔట్ సోర్స్ కార్మికురాలికి నోటీసులు జారీ చేసి వివరణ కోరినట్లు తెలిసింది. వింగ్ శానిటేషనే అయినా ఒక్కో కార్మికురాలికి ఒక్కో రకంగా నిబంధనలను అమలు చేయటం చర్చనీయాంశంగా మారింది. కానీ రూల్స్ ప్రకారం ఔట్ సోర్స్ కార్మికులకు అధికారులు నోటీసులు జారీ చేయరాదని నిబంధనలు చెబుతున్నా, సర్కిల్ స్థాయి అధికారులు, మెడికల్ ఆఫీసర్లు కుమ్మక్కై నోటీసు జారీ చేసి, మరో వైపు రహస్యంగా జీతాల చెల్లింపులు కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మూడు నెలలు విధులకు హాజరు కాని కార్మికుడిని ఏకంగా విధుల్లో నుంచి తొలగించగా, ఎనిమిది నెలలు విధులకు హాజరు కాని కార్మికుడికి కేవలం నోటీసులు జారీ చేయటం వెనకా ఆంతర్యమేమిటీ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎనిమిది నెలలు విధులకు హాజరు కాని ఉద్యోగి నుంచి భారీగా లంచాలు తీసుకుని, చర్యలను కేవలం నోటీసులకే పరిమితం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

స్వీపర్ పోస్టుకు రూ.2 లక్షలు..ఎస్ఎఫ్ఏకు రూ.4 లక్షలు

శానిటేషన్ విభాగంలో 60 ఏళ్లు నిండిన కార్మికులను విధుల్లో నుంచి తొలగించి, వారి స్థానంలో వారి వారసులను నియమించాలని 2017లో అప్పటి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా, వాటిని అధికారులు అమలు చేయకుండా పక్కన బెట్టడంతో పాటు ఆ ఆదేశాల గురించి ప్రస్తావించే కార్మికులు, వారి పిల్లలను అలాగే ఆదేశాలేమీ లేవని చెబుతూ, ఖాళీ అవుతున్న పోస్టులను అడ్డదారిలో భర్తీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. స్వీపర్ పోస్టుకు రూ. 2 లక్షలు, శానిటరీ ఫీల్డు అసిస్టెంట్ పోస్టుకు రూ. 4 లక్షలుగా రేటును ఫిక్స్ చేసినట్లు కూడా ఆరోపణలున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి సర్కిల్ లో వందల సంఖ్యలో ఖాళీలున్నట్లు సమాచారం. మరి కొన్ని సర్కిళ్లలో ఖాళీ అయిన పోస్టులో ఎస్ఎఫ్ఏ కుటుంబ సభ్యుల వివరాలను చేర్చి, జీతాలు క్లెయిమ్ చేసి, వాటిని ఎస్ఎఫ్ఏ, మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లు పంచుకుంటున్నట్లు సమాచారం. గతంలో సికిందరాబాద్ జోన్ లోని బేగంపేట సర్కిల్ లో నాలుగేళ్ల పాటు మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తించిన ఓ అధికారి డమ్మీలతోనే రూ. 10 కోట్ల వరకు అక్రమార్జనకు పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం.

Also read: భార్యాభర్తలమే కానీ వేరుగా ఉంటున్నాం.. రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Tags

Related News

సీపీ సజ్జనార్‌పై సీబీఐ విచారణ జరిపించాలి.. సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ లేఖ

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. తెలంగాణకు రూ.30 వేల కోట్ల సాయంపై కీలక చర్చ!

మూడు నెలల్లో సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం తెలుగు వెర్షన్!

బ్లాక్ మెయిల్ కోసమే హైడ్రా.. ఆ భూమి మునిగితే ముక్కు నేలకు రాస్తా: ఈటల సవాల్

తెలంగాణలో పాలసీ పెరాలసిస్ లేదు.. పెట్టుబడిదారులకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ ఆఫర్!

ప్రేమ కాటుకు బలైన సుస్మిత.. మృతదేహానికి చెట్టుతో పెళ్లి.. అసలేం జరిగిందంటే?

పెళ్లి పేరుతో అత్యాచారం.. ముంబై మహిళ ఫిర్యాదు, హైదరాబాద్‌లో కేసు నమోదు

Big Stories

Advertisement
×