E-Paper
Advertisement

Kishan Reddy: కేసీఆర్ అరెస్టును నేను ఎక్కడ అడ్డుకున్నాను? రేవంత్ కు కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

Kishan Reddy: కేసీఆర్ అరెస్టును నేను ఎక్కడ అడ్డుకున్నాను? రేవంత్ కు కిషన్ రెడ్డి సూటి ప్రశ్న
Advertisement

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని, ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి అబద్ధాలు, మోసపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత ఎంపీ ఎన్నికల్లో 50 శాతం సీట్లు, ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమని ఆయన గుర్తుచేశారు.

మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన భారీగా నిధులు అందజేస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్, అమృత్ పథకం, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఉచిత బియ్యం వంటి కార్యక్రమాల ద్వారా పట్టణాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్రమే ఎక్కువ నిధులు ఇచ్చిందని ఆయన సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి కేవలం మాటలతో కాలం గడుపుతున్నారని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేస్తామని కేంద్రం ఎన్నడూ చెప్పలేదని ఆయన వివరించారు. ఈ అంశంపై సెక్రటేరియేట్ లేదా ప్రెస్ క్లబ్‌లో ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు.

Advertisement

వ్యక్తిగత విమర్శలపై కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ, తన ఇంటి పేరు మార్చడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని వారు దారుస్సలాంలో తాకట్టు పెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతి వల్ల రోడ్డున పడిందని, ఆ పార్టీకి ఓటేసినా, మూసీ నదిలో వేసినా ఒకటేనని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని, ఆరు గ్యారంటీలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని గుర్తుచేశారు.

మక్తల్ బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్యపై కిషన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు, బెదిరింపుల వల్లే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని, దీనిపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్టు చేయకుండా ఎవరు అడ్డుకుంటున్నారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ ను అరెస్టు చేస్తే ఎవరూ అడ్డుకోరని, సోనియా గాంధీ కుటుంబానికి, కేసీఆర్ కుటుంబానికి మధ్య ఉన్న రహస్య ఒప్పందాల వల్లే చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నిందలు వేయడం సరికాదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Read Also: Collector BM Santosh: పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి : జిల్లా కలెక్టర్ సంతోష్!

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×