E-Paper
Advertisement

Kodanda Reddy: రైతులకు మేలైన విత్తనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం : కోదండరెడ్డి!

Kodanda Reddy: రైతులకు మేలైన విత్తనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం :  కోదండరెడ్డి!
Advertisement

Kodanda Reddy:  నకిలీ విత్తనాలను అరికట్టాలంటే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మరిన్ని మేలైన విత్తనాలను ఉత్పత్తి చేసి రైతులకు ఇవ్వాలని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి (Kodanda Reddy) సూచించారు. రైతు కమిషన్ కార్యాలయంలో విత్తనోత్పత్తి క్షేత్రాలపై రైతు కమిషన్ సమీక్షా సమావేశం నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాలో 8 చోట్ల సీడ్ ఫార్మ్ ఉన్నాయని, 1629 ఎకరాల్లో వున్న సీడ్ ఫార్మ్ లో వివిధ రకాల విత్తనాలను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విత్తనోత్పత్తి చేస్తున్నట్లు అడిషనల్ డైరెక్టర్ నర్సింహారావు కమిషన్కు వివరించారు. వరి, పెసర, జనుము, కందులు విత్తనోత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. రైతు మిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ విత్తనోత్పత్తిని పెంచాలని దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

Also ReadCollector BM Santosh: పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి : జిల్లా కలెక్టర్ సంతోష్!

ప్రభుత్వ దృష్టికి తేవాలి 

Advertisement

త్తనోత్పత్తి క్షేత్రాల భూములు అన్యాక్రాంతం కాకుండా హద్దులను ఏర్పాటు చేసుకొని చుట్టూ ఫెన్సింగ్ చేయాలని సూచించారు. ఎక్కడైనా భూ సమస్యలు ఉన్న చోట ఆ విషయాలను అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తేవాలని సూచించారు. వ్యవసాయ శాఖకు చెందిన భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ సమావేశంలో రైతు కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, కమిషన్ మెంబర్ సెక్రటరీ గోపాల్ , వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ సుచరిత, డీడీఏ నాగమల్లీశ్వరీ, ఏడీఏ ఉషారాణి, సీడ్ ఫార్మ్ కు చెందిన అగ్రికల్చర్ అధికారులు వైద్యనాధ్, సక్రియ నాయక్, ఇంద్రసేన్, అనిల్ కుమార్, వాసు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Also Read: Srinivas Goud: కాంగ్రెస్‌కు అనుకూలంగా పోలీసుల వ్యవహారం.. బీఆర్‌ఎస్‌ నేత శ్రీనివాస్ గౌడ్ ఫైర్!

Advertisement

 

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×