E-Paper
Advertisement

Komatireddy: నా కొడుకు చనిపోయాడు.. సోషల్ మీడియా వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి.. కోమటిరెడ్డి ఆవేదన

Komatireddy: నా కొడుకు చనిపోయాడు.. సోషల్ మీడియా వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి.. కోమటిరెడ్డి ఆవేదన
Advertisement

Komatireddy: మహిళా అధికారులపై చెప్పలేని భాషలో వార్తలు ప్రసారం చేయడాన్ని మంత్రి కోమటిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎంతో కష్టపడి ఆ స్థాయికి వస్తారని.. సెలవులు కూడా లేకుండా ప్రజల కోసం పనిచేసే వారిపై బురద చల్లడం ఏంటని ప్రశ్నించారు. అధికారుల బదిలీలు ముఖ్యమంత్రి పరిధిలో ఉంటాయని, తమకు చెప్పి బదిలీలు చేయరని ఆయన స్పష్టం చేశారు.

మీడియా ప్రతినిధులకు భార్య, పిల్లలు ఉంటారని.. ఇలాంటి వార్తలు రాసే ముందు మీ ఇంట్లో వారికి ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలని హితవు పలికారు. రాజకీయ విమర్శలను తాము స్వీకరిస్తామని, కానీ అధికారులను వేధించడం సరికాదని కోమటిరెడ్డి హెచ్చరించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఇప్పటికే డీజీపీని కోరానని, ప్రభుత్వంపై జరుగుతున్న కుట్రలను త్వరలోనే బయటపెడతామని మంత్రి తెలిపారు.

Advertisement

తన వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావిస్తూ.. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశానని, తనకున్న కుమారుడిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా.. ఫౌండేషన్ పేరుతో ప్రజాసేవ చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో రాసే తప్పుడు వార్తల వల్ల ఆత్మహత్యకు చేసుకునే పరిస్థితి వరకు వచ్చిందని అన్నారు. ఇంకా సరిపోదు అనుకుంటే నాకింత విషమిచ్చి చంపేయండని మంత్రి కోమటిరెడ్డి ఎమోషనల్ కు గురయ్యారు.

మహిళా అధికారులపై ప్రచురితమైన కథనాలను టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ ఖండించారు. వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా వార్త కథనాలు ప్రచురించడం బాధాకరం అన్నారు. అలాగే మంత్రులను టార్గెట్ చేస్తూ అసత్య కథనాలు రాయడం బాధాకరం అన్నారు. ఒక మంత్రి స్థానానికి చేరుకోవాలంటే దశాబ్దాల కృషి ఉంటుందని.. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మంత్రి స్థాయికి చేరుకుంటారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తులపై వాస్తవానికి దూరంగా వార్తా కథనాలు శ్రేయస్కరం కాదన్నారు మహష్‌ గౌడ్‌.

Advertisement

ALSO READ: తెలంగాణలో మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధం.. జనవరి 17 తర్వాత వెలువడనున్న షెడ్యూల్!

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×