BigTV English

Komatireddy Venkat Reddy : నాకు శాలువాలు, బొకేలు తీసుకురావద్దు.. ఆ డబ్బును వాటికి ఉపయోగించండి..

Komatireddy Venkat Reddy : నూతన సంవత్సర సందర్భంగా తనను కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు శాలువలు, బొకేలు తీసుకురావాల్సిన అవసరం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. వాటికి అయ్యే ఖర్చును సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వాలని ఆయన కోరారు. దీని వలన ఎంతో మంది నిరుపేదలకు ఉపయోగం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయి లీడర్లు తమను కలవడమే సంతోషం అన్నారు. ఎలాంటి గిఫ్టలు, హంగు ఆర్భాటాలకు వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు లీడర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నారు. ప్రజాపాలన ద్వారా ఇతర కార్యక్రమాల ద్వారా తామే మీ ఇంటి ముందుకు వచ్చి సమస్యల్ని తెలుసుకొని పరిష్కారిస్తామన్నారు మంత్రి.

Komatireddy Venkat Reddy : నాకు శాలువాలు, బొకేలు తీసుకురావద్దు.. ఆ డబ్బును వాటికి ఉపయోగించండి..

Komatireddy Venkat Reddy : నూతన సంవత్సరం సందర్భంగా తనను కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు శాలువలు, బొకేలు తీసుకురావాల్సిన అవసరం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. వాటికి అయ్యే ఖర్చును సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వాలని ఆయన కోరారు. దీని వలన ఎంతో మంది నిరుపేదలకు ఉపయోగం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు.. క్షేత్రస్థాయి లీడర్లు తమను కలవడం సంతోషకరమైన విషయమని అన్నారు.


ఎలాంటి గిఫ్టలు, హంగు ఆర్భాటాలకు వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు లీడర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నారు. ప్రజాపాలన ద్వారా ఇతర కార్యక్రమాల ద్వారా తామే మీ ఇంటి ముందుకు వచ్చి సమస్యల్ని తెలుసుకొని పరిష్కారిస్తామన్నారు మంత్రి.

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట దోచుకొని ప్రభుత్వ ఖజనాను ఖాళీ చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. దీంతో డబ్బులు వృథా చేయకుండా సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తే అది నిరుపేదల ఆరోగ్య రక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని కార్యకర్తలకు సూచించారు.


ఇక రాష్ట్ర ప్రజలకు మంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆదివారం మంత్రిని కలవడానికి వచ్చి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకరావడంతో వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. దీంతో నూతన సంవత్సరం సందర్భంగా మంత్రి సమస్యలను పరిష్కరించడంతో సదరు ఆర్జీదారులు, సాధారణ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

Tags

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×