BigTV English

KA Paul: ఇంటింటికీ వెళ్ళాల్సిందే.. సారీ చెప్పాల్సిందే.. లేకుంటే కేసు వేస్తా.. మంత్రి వ్యాఖ్యలపై రెచ్చిపోయిన పాల్

KA Paul: ఇంటింటికీ వెళ్ళాల్సిందే.. సారీ చెప్పాల్సిందే.. లేకుంటే కేసు వేస్తా.. మంత్రి వ్యాఖ్యలపై రెచ్చిపోయిన పాల్

KA Paul Comments: తెలంగాణ మంత్రి కొండా సురేఖ తాజాగా నాగార్జున ఫ్యామిలీకి సంబంధించిన అంశంపై చేసిన కామెంట్స్ పై సర్వత్రా విమర్శలు రాగా.. మంత్రి సారీ చెప్పారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపగా.. ఆ సెగ టాలీవుడ్ ని సైతం తాకింది. ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ ప్రముఖులు సైతం ఘాటుగా స్పందించారు. కొండా సురేఖ సారీ ప్రకటన కేవలం హీరోయిన్ సమంతను ఉద్దేశించి ఉందని, నాగార్జున ఫ్యామిలీకి చెప్పినట్లు లేదని టాలీవుడ్ పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా దుమారం రేగిన మంత్రి కొండా వ్యాఖ్యలపై తాజాగా ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కేఏ పాల్ స్పందించారు.


కేఏ పాల్ మాట్లాడుతూ.. రాజకీయ విమర్శలు చేసే సమయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరాన్ని నేతలు విస్మరిస్తున్నారన్నారు. అలాగే మంత్రి కొండా సురేఖ తాను చేసిన వ్యాఖ్యలపై సారీ చెప్పడం వరకు బాగానే ఉందని, ఇక ఆమె మంత్రి పదవిలో ఉండే అర్హత కోల్పోయారన్నారు. మంత్రి కొండాకు మతిభ్రమించిందని.. 72 గంటల్లో ఆమె రాజీనామా చేయాలని పాల్ ఘాటుగా స్పందించారు. తాను ఈ విషయంలో న్యాయ నిపుణులతో మాట్లాడి కేసు వేస్తానని కూడా హెచ్చరించారు. అయితే సారీతో సరిపోయే మాటలు కావని, సమంత, నాగార్జున లాంటి ప్రముఖుల ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పాలని ఆయన సూచించారు.

అయితే మంత్రి.. గృహాలకు వెళ్ళి సారీ చెప్పాలన్న మాటలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయని చెప్పవచ్చు. మంత్రి వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణించిన కాంగ్రెస్ పెద్దలు వెంటనే మంత్రి చేత క్షమాపణ చెప్పించారు. అలాగే సాక్షాత్తు పీసీసీ అద్యక్షుడు మహేష్ గౌడ్ కూడా స్పందించి.. మంత్రి వ్యాఖ్యలు తనను కూడా బాధించాయని, మంత్రి క్షమాపణలు స్వీకరించి ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు. కాగా ఇప్పటికే టాలీవుడ్ అగ్ర హీరోలు, హీరోయిన్ లు ఈ వివాదంపై ట్వీట్ ల పర్వాన్ని కొనసాగిస్తుండగా.. పాల్ కొత్త నినాదం తీసుకురావడం ప్రత్యేకతను సంతరించుకుంది. పాల్ డిమాండ్ పై మంత్రి కొండా సురేఖ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.


అలాగే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా మంత్రి వ్యాఖ్యలను తప్పుపడుతూ… ట్వీట్ల వర్షాన్ని సాగిస్తున్నారు. అలాగే సమంతకు క్షమాపణలు కాకుండా.. నేరుగా నాగార్జున, నాగ చైతన్యలకు సారీ చెప్పాలని వర్మ సైతం కోరారు. ఇలా టాలీవుడ్ ఒక్కసారిగా పొలిటికల్ నేతల కామెంట్స్ పై ఇంత స్థాయిలో స్పందించడం ఇదే తొలిసారి కావచ్చు. కానీ మంత్రి సారీ చెప్పినా కూడా.. ఈ విషయాన్ని సాగదీయడం ఎందుకని కొందరి వాదనగా వినిపిస్తోంది. మరి ఈ వివాదం ఇంతటితో సద్దుమణిగేనా.. లేక ఇంకా రగులుతూనే ఉంటుందా అనే విషయం క్లారిటీ రావాల్సి ఉంది.

Related News

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 25న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Big Stories

×