E-Paper
Advertisement

Fire Accident: దేవుడి గదిలో దీపం.. ఇల్లు దగ్ధం

Fire Accident: దేవుడి గదిలో దీపం.. ఇల్లు దగ్ధం
Advertisement

Fire Accident:  నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ పరిధిలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి ఒక నిరుపేద కుటుంబం నిలువనీడ కోల్పోయింది. మున్సిపాలిటీలోని నాలుగవ వార్డు సంపల్లీ ప్రాంతానికి చెందిన కథల మొగులయ్య అనే వ్యక్తి నివాసంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. కేవలం ఒక చిన్న దీపం ఆ కుటుంబం తలదాచుకునే నీడను బూడిద చేయడం స్థానికంగా అందరినీ కలచివేసింది.

బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఇంటి యజమాని కథల మొగులయ్య నిత్యం లాగే ఉదయం నిద్రలేచి తన దైనందిన కార్యక్రమాలను ముగించుకున్నాడు. ప్రతిరోజూ పూజ చేసే అలవాటు ఉన్న మొగులయ్య, శుక్రవారం కావడంతో ఇంట్లోని దేవుడి ఫొటోల ముందు భక్తితో దీపం వెలిగించాడు. అనంతరం జీవనోపాధి కోసం కూలీ పనులకు వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులు కూడా బయటకు వెళ్లిన సమయంలో, గాలికి లేదా మరేదైనా కారణంతో దీపం నుంచి మంటలు పక్కనే ఉన్న వస్తువులకు అంటుకున్నాయి.

Advertisement

మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో క్షణాల్లో ఇల్లు మొత్తం వ్యాపించాయి. ఇంట్లో ఉన్న గృహోపకరణాలు, బట్టలు, ధాన్యంతో పాటు ముఖ్యమైన పత్రాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.

మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ, అప్పటికే మంటలు తీవ్రరూపం దాల్చడంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. కష్టపడి కూడబెట్టుకున్న సామాగ్రి, నిత్యావసర వస్తువులు కళ్లముందే బూడిదవ్వడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.

Advertisement

కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే మొగులయ్య కుటుంబం ఈ ప్రమాదంతో రోడ్డున పడింది. చేతిలో చిల్లిగవ్వ లేక, తలదాచుకోవడానికి నీడ లేక ఆ కుటుంబం విలవిల్లాడుతోంది. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని, నష్టపరిహారం అందించి నివాసం ఏర్పాటు చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related News

తెలుగు రాష్ట్రాలకు వరుణుడి ముప్పు.. దూసుకొస్తున్న వర్షాలు.. రాబోయే రెండు రోజులు జాగ్రత్త సుమా!

ఒకే చోట బోనాల పూజా సామాగ్రి.. ఈ నెల 16 నుంచి హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్!

Khan Academy: తెలంగాణ విద్యాశాఖ సరికొత్త నిర్ణయం.. డిజిటల్ స్క్రీన్లపై మ్యాథ్స్, సైన్స్ పాఠాలు!

‘కూలేశ్వరం’పై కేటీఆర్ కొత్త కథలు.. అద్దంకి దయాకర్ షాకింగ్ కామెంట్స్!

Kishan Reddy: సర్కార్‌కు ఓవైసీ అంటే భయమా?.. హైడ్రాపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

కేసీఆర్‌కు వారం ఇస్తే రాష్ట్రమంతా నీరే.. కేటీఆర్ సంచలనం!

Zaheerabad: జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. డాక్టర్లు లేక నర్సుల డెలివరీకి పసికందు మృతి!

రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.. కేక్ కట్ చేసిన మణుగూరు కాంగ్రెస్ శ్రేణులు

Big Stories

Advertisement
×