E-Paper
Advertisement

ద్వేషం, హింసతో వాళ్లను ఎదుర్కోలేం.. మోదీ, అదానీలపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

ద్వేషం, హింసతో వాళ్లను ఎదుర్కోలేం.. మోదీ, అదానీలపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

Rahul Gandhi: హైదరాబాద్ హెచ్ఐసీసీ భారత్ సమ్మిట్ 2026 సమావేశంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి రాకముందు ప్రపంచ కుబేరుల జాబితాలో 600వ స్థానంలో ఉన్న వ్యాపారవేత్త, 7 నెలల క్రితం 2వ స్థానానికి చేరారని అన్నారు. ​రాజకీయాలకు, వ్యాపారానికి మధ్య ఉన్న గీత చెరిగిపోయిందని, మోదీ, అదానీల కలయిక వల్లే ఇది సాధ్యమైందని రాహుల్ గాంధీ అన్నారు.

పెద్ద ఆర్థిక శక్తిగా బీజేపీ..

​ఎయిర్‌పోర్టులు, పోర్టులు, బ్రిడ్జిలు, సిమెంట్, డిఫెన్స్.. ఏ రంగం చూసినా అదానీ ఆస్తులే కనిపిస్తున్నాయని అన్నారు. ​దశాబ్ద కాలంలో బీజేపీ ఆస్తులు 11 రెట్లు పెరిగాయని, ఎవరూ పోటీ పడలేని ఆర్థిక శక్తిగా బీజేపీ మారిందని అన్నారు. ​మీడియా, ప్రెస్ కాన్ఫరెన్స్‌లు, బహిరంగ సభలు, ఏవీ ప్రజల కోసం పనిచేయడం లేదని వ్యవస్థలన్నీ మోడీ గుప్పిట్లోకి వెళ్లిపోయాయని రాహుల్ గాంధీ అన్నారు.

మొత్తం మోడీనే..

Advertisement

​ప్రస్థుతం దేశంలో టీవీలు, సోషల్ మీడియాలో మొత్తం 24 గంటలూ మోదీ, బీజేపీనే చూపిస్తున్నాయని రాహుల్ గాంధీ పేర్కోన్నారు. దేశంలో ప్రతిపక్షాలకు కనీస మద్దతు లేకుండా పోయిందని రాహుల్ గాంధీ గాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read: మా అయ్య బీజేపీ సర్పంచ్.. ఏం చేసుకుంటావో చేసుకో- ప్రియుడి వేధింపులకు దళిత యువతి బలి!

అవి మన సిద్దాంతాలు కావు..?

Advertisement

ద్వేషం, హింసతో మనం వాళ్లను ఎదుర్కోలేంమని అవి మన సిద్ధాంతాలు కావు అని, ​త్వరలో వాళ్లు ఓడిపోయే రోజు వస్తుందని, సత్యం, అహింస, ప్రేమ చేతిలోనే వాళ్లు ఓడిపోతారని రాహుల్ గాంధీ అన్నారు. ​మనలాగే ఆలోచించే, ఒకే తరహా పోరాటం చేస్తున్న మిత్రులందరికీ స్వాగతం అని, ​ఒకే తరహా ఆర్థిక వ్యవస్థ, ద్వేషపూరిత శక్తులపై మనందరం కలిసి పోరాడుతున్నామని అన్నారు. ​దేశంలోని ప్రతి మూల నుంచీ ఫాసిస్టు శక్తులను తరిమికొట్టడమే మా లక్ష్యం అని, ​మేం ఎవరినీ ద్వేషించం, కించపరచం, అవమానించాలనే ఆలోచన మాకు లేదరి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ​మా సిద్ధాంతాలకు కట్టుబడి, ఆప్యాయతతోనే మా పోరాటం కొనసాగిస్తామని అన్నారు.

Tags

Related News

అనుమతుల్లేకుండానే ధనిక్‌ భారత్‌ కళాశాల అడ్మిషన్ల దందా.. అధికారులు వార్నింగ్!

అధికారం కంటే ప్రజలే ముఖ్యం.. అదే రాహుల్ గాంధీ ఆశయం: మంత్రి శ్రీధర్ బాబు

మా అయ్య బీజేపీ సర్పంచ్.. ఏం చేసుకుంటావో చేసుకో- ప్రియుడి వేధింపులకు దళిత యువతి బలి!

ఏకాభిప్రాయానికి రండి.. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర జల సంఘం లేఖ..!

మద్యానికి డబ్బులివ్వలేదని భార్యను కర్రతో కొట్టి చంపిన భర్త.. కోహీర్‌లో దారుణం!

గడ్చిరోలి గడ్డపై ఆదివాసీ కళా వైభవ జాతర.. ఉత్సవానికి సర్వం సిద్ధం!

గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభం.. వేదికపై రాహుల్, రేవంత్ రెండు కీలక హామీలు!

Big Stories

Advertisement
×