E-Paper
Advertisement

మెక్రాన్ రొమాన్స్‌.. రాజకీయాల్లో రచ్చ.. ఈ పలకరింపుల వెనుక కథేంటి?

మెక్రాన్ రొమాన్స్‌.. రాజకీయాల్లో రచ్చ.. ఈ పలకరింపుల వెనుక కథేంటి?
Advertisement

Macron Controversy: ప్రపంచ దేశాల అధ్యక్షులు, ప్రధానులు కలిస్తే చర్చించాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. యుద్ధాలు.. వాణిజ్య ఒప్పందాలు.. అంతర్జాతీయ సంబంధాలు.. దేశాల భవిష్యత్తు.. ఇలా చాలా వాటిపై చర్చ జరుగుతుంది. కానీ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ పాల్గొనే వాటిలో మాత్రం చర్చంతా మరో అంశంపై జరుగుతోంది. మహిళా నేతలను పలకరించే టైమ్‌లో ఆయన చూపిస్తున్న అత్యుత్సాహం.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌. ఒకసారి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో గుసగుసలు.. మరోసారి చెంపకు చెంప ఆనించి పలకరింపు.. ఇప్పుడు ఐస్‌లాండ్‌ ప్రధాని క్రిస్‌టూన్‌ ఫ్రాస్టదోతిర్‌ని హగ్‌ చేసుకునేందుకు ట్రై చేయడం.. ఇదంతా చూస్తుంటే అసలు మెక్రాన్‌ పలకరింపుల్లో అంత స్పెషాలిటీ ఏమిటన్న చర్చ మొదలైంది. అయితే ఇది కేవలం మెక్రాన్‌ వ్యవహారమేనా? ప్రపంచ రాజకీయ చరిత్రలో అధ్యక్షుల వ్యక్తిగత జీవితాలు, ప్రేమ వ్యవహారాలు ఎప్పుడైనా సంచలనం సృష్టించాయా? తెలుసుకుందాం.

హగ్‌లు, గుసగుసలు, చెంపపై ముద్దులు..

Advertisement

2025 జూన్‌.. కెనడాలో జీ7 శిఖరాగ్ర సమావేశం. ప్రపంచ నేతలంతా ఒకచోట చేరిన సమయంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ దగ్గరకు వంగి ఏదో గుసగుసలాడారు. ఆమె కూడా ఆయన చెప్పేది వినేందుకు ముందుకు వంగారు. కానీ ఆ తర్వాత మెలోనీ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ కెమెరాలకు చిక్కింది. ఆమె కళ్లు తిప్పిన దృశ్యం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అసలు మెక్రాన్‌ ఏం చెప్పారు? మెలోనీ ఎందుకలా స్పందించారు? అంటూ నెటిజన్లు రకరకాలుగా చర్చించుకున్నారు. ఇంతటితో కథ ముగియలేదు.

చెంపపై ముద్దులు..

Advertisement

2026 ఏప్రిల్‌లో పారిస్‌లోని ఎలీసీ ప్యాలెస్‌లో జరిగిన సమావేశానికి మెలోనీ వెళ్లినప్పుడు మెక్రాన్‌ ఆమెను చెంపకు చెంప ఆనిస్తూ ఆత్మీయంగా పలకరించారు. ఈ సీన్‌ కూడా వైరల్‌ అయింది. అయితే యూరప్‌లో చెంపపై ముద్దుతో పలకరించడం కొన్ని దేశాల్లో నార్మలే.. కానీ ఇది ఎందుకో కాస్త ఓవర్‌గా అనిపించింది.

వద్దంటున్నా వెనక్కి తగ్గని మెక్రాన్..

ఇప్పుడు ఐస్‌లాండ్‌ ప్రధాని వంతు. 2026 నవంబర్‌ 13.. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌. యూరోపియన్‌ పొలిటికల్‌ కమ్యూనిటీ సమావేశానికి 40కి పైగా దేశాల నేతలు హాజరయ్యారు. అక్కడ ఐస్‌లాండ్‌ ప్రధాని క్రిస్‌టూన్‌ ను మెక్రాన్‌ పలకరించిన తీరు మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. మెక్రాన్‌ ఆమెను హగ్ చేసుకునేందుకు ముందుకు వెళ్లగా.. ఆమె కాస్త వెనక్కి జరిగి, ఆయన భుజంపై చేయి ఉంచినట్లు ఫొటోలో కనిపించింది. ఆమె పక్కకు తప్పుకుంటున్నట్లుగా కనిపించడం.. మెక్రాన్‌ మాత్రం చిరునవ్వుతో ముందుకు రావడం.. ఇదంతా చూస్తుంటే.. వాళ్లు వద్దు అంటు సిగ్నల్స్ ఇస్తున్నా.. మెక్రాన్ మాత్రం ముందుకు వెళుతున్నట్టు అనిపిస్తోంది.

అమెరికా అధ్యక్షుడిపై అభిశంసన ప్రక్రియకు దారి..

నిజానికి ప్రపంచ నేతల వ్యక్తిగత జీవితాలు రాజకీయాలను ప్రభావితం చేయడం కొత్తేమీ కాదు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ వ్యవహారమే అందుకు పెద్ద ఎగ్జాంపుల్. వైట్‌హౌస్‌లో ఇంటర్న్‌గా పనిచేసిన మోనికా లెవిన్‌స్కీతో క్లింటన్‌కు ఉన్న ఎఫైర్ 1998లో బయటపడింది. మొదట దీనిని ఖండించిన క్లింటన్‌.. ఆ తర్వాత నిజమే అని ఒప్పుకున్నారు. ఈ వ్యవహారం కేవలం వ్యక్తిగత వివాదంగా మిగిలిపోలేదు. అమెరికా అధ్యక్షుడిపై అభిశంసన ప్రక్రియకు దారితీసింది. 1998 డిసెంబర్‌లో ప్రతినిధుల సభ ఆయనపై అభిశంసనకు ఆమోదం తెలిపింది. అయితే 1999 ఫిబ్రవరిలో సెనేట్‌లో ఆయన నిర్దోషిగా బయటపడ్డారు. అంటే ఒక అధ్యక్షుడి వ్యక్తిగత జీవితం… ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశ రాజకీయాల్లో ఎంతటి ప్రకంపనలు సృష్టించగలదు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్.

ఫ్రాన్స్‌లోనూ ఇలాంటి సంచలనమే

ఇక ఫ్రాన్స్‌లోనూ ఇలాంటి సంచలనమే జరిగింది. 2014లో అప్పటి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌ పేరూ దేశానికి చెందిన యాక్టర్ జూలీ గయే మధ్య రిలేషన్ షిప్ ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఒక ఫ్రెంచ్‌ మ్యాగజైన్‌ ఆయన జూలీ గయేను కలుస్తున్నట్లు ఫొటోలు కూడా పబ్లిష్ చేసింది. దీంతో ఫ్రాన్స్‌ అధ్యక్షుడి వ్యక్తిగత జీవితం, అధికారిక బాధ్యతలు, గోప్యతపై పెద్ద చర్చ జరిగింది. ఇలా అమెరికా నుంచి ఫ్రాన్స్‌ వరకు… అధ్యక్షుల వ్యక్తిగత వ్యవహారాలు పొలిటికల్ హిస్టరీలో ఒక స్పెషల్ చాప్టర్‌గా నిలిచిపోయాయి.

మెక్రాన్ పలకరింపులతో నేతలకు చిక్కులు!

ఒకసారి మళ్లీ మెక్రాన్ వద్దకు వద్దాం. మెక్రాన్‌ పలకరింపులు మహిళా నేతలకే పరిమితమా అంటే కానే కాదు. మెక్రాన్‌ మగవాళ్లను విష్ చేసే విషయంలో కూడా హాట్‌ టాపిక్‌గా మారారు. 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఆయన కౌగిలింతలు, చేతులు పట్టుకుని పలకరించడం అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 2026 జూలైలో టర్కీలో జరిగిన నాటో మీటింగ్ సందర్భంగా అధ్యక్షుడు ఎర్డోగాన్‌ భార్య ఎమినె ఎర్డోగాన్‌ను విష్ చేసే టైమ్‌లో కూడా ఆమె చేతిపై ముద్దు పెట్టేందుకు ట్రై చేశారు. ఆమె చేతిని వెనక్కి లాక్కోవడం కూడా వీడియోల్లో రికార్డైంది. సో.. మెక్రాన్‌ విష్ చేయడంపై వివాదం ఇప్పటిది కాదు.. చాలా ఏళ్లుగా నడుస్తూనే ఉంది.

ఫ్రెంచ్ కల్చరా? లేక హద్దులు దాటడమా?

నిజానికి ఒక దేశాధినేత మరో దేశాధినేతను ఆత్మీయంగా పలకరించడంలో తప్పేమీ లేదు. యూరప్‌లో చెంపపై ముద్దులు, హగ్ చేసుకోవడాలు అక్కడి కల్చర్‌లో భాగమే. కానీ ఎదుటి వ్యక్తికి అది సౌకర్యంగా ఉందా లేదా అన్నది అంతకంటే ముఖ్యం. అంతర్జాతీయ వేదికపై నేతలు చేసే ప్రతి పనికి రాజకీయ ప్రాధాన్యం ఉంటుంది. ఒక చిన్న ఫొటో కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. అందుకే దౌత్య మర్యాదలతోపాటు వ్యక్తిగత హద్దులను గౌరవించడం కూడా ముఖ్యమే.

సోషల్ మీడియాలో సంచలనంగా మారిన మెక్రాన్ పలకరింపులు..

బిల్‌ క్లింటన్‌ ఎఫైర్ అమెరికా రాజకీయాల్లో అభిశంసన వరకు వెళ్లింది. హోలాండ్‌ వ్యక్తిగత జీవితం ఫ్రాన్స్‌లో పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. ఇప్పుడు మెక్రాన్‌ పలకరింపులు సోషల్‌ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. మరి ఇది ఇంకా ఎలాంటి రచ్చకు దారి తీస్తుందో చూడాలి.

Also Read: అప్పుడు బాలీవుడ్.. ఇప్పుడు సోనియా.. కాంట్రవర్సీ ‘క్వీన్’

Tags

Related News

అప్పుడు బాలీవుడ్.. ఇప్పుడు సోనియా.. కాంట్రవర్సీ ‘క్వీన్’

ఫామ్‌హౌజ్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌.. తొలిసారిగా కవితపై విరుచుకుపడ్డ పార్టీ..! సిద్దిపేట అడ్డాగా చేసిన కామెంట్స్‌తో మౌనం వీడి..

గులాబీ పార్టీలో యువ గలం అసంతృప్తి.. ఎందుకో తెలుసా..?

ఏడేళ్ల కిందటి ‘దిశ’ ఎన్‌కౌంటర్‌ కథతో ‘దాయ్రా’ మూవీ! పృథ్వీరాజ్‌ హీరోగా హిందీ మూవీ..! ఎన్‌కౌంటర్‌ను సమర్థించే పాత్రలో పృథ్వీ!

పన్నుల నుంచి పర్మిషన్‌ల వరకు.. CUREతో హైదరాబాద్‌లో మారేదేంటి?

ఒక్క కేసీఆర్‌.. పదేండ్ల పాలన! ఆమాంతం పెరిగిన కుటుంబ ఆస్తులు! అంతా కలిసి కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌కు పరిమితం చేసి!

భారత్‌ సమ్మిట్ వేదికగా రాజకీయ రగడ.. వీసాల రద్దు వెనుక మోడీ సర్కార్ వ్యూహమేంటి?

Big Stories

Advertisement
×