E-Paper
Advertisement

Wardhannapet : కాంగ్రెస్ జెండా ఎగరవేస్తా.. కేఆర్ నాగరాజు ధీమా..

Wardhannapet : కాంగ్రెస్ జెండా ఎగరవేస్తా.. కేఆర్ నాగరాజు ధీమా..
Advertisement

Wardhannapet : వర్ధన్నపేట నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన ఘనత స్థానిక శాసనసభ్యుడు ఆరూరి రమేష్‌కే దక్కుతుందని నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కేఆర్ నాగరాజుకు వర్ధన్నపేట అసెంబ్లీ టికెట్ కేటాయించింది. ఈ సందర్భంగా నాగరాజు తన అనుచరులతో వరంగల్ శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు తనని ఎంతో ఆదరిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా రైతులు, యువత, విద్యార్థులందరూ ప్రేమతో పలకరిస్తూ తనకి ఓటు వేస్తానని హామీ ఇస్తున్నారని చెప్పారు. ప్రస్తుత వర్ధన్నపేట శాసనసభ్యుడు ఆరూరి రమేష్ చేయని కబ్జాలు లేవని ఆరోపించారు. అన్యాయంగా రైతులపై, నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించి జైలుకు పంపుతున్నారని ఆయన వాపోయారు.

Advertisement

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశీస్సులు తనకు ఉన్నాయని తెలిపారు. ప్రజల దీవెనలతో వర్ధన్నపేటలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని కేఆర్ నాగరాజు అన్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×