BigTV English

Young ISRO Scientist Life Story : చంద్రయాన్-3 మిషన్.. ఆ సాఫ్ట్‌వేర్ రూపకర్త తెలుగు యువకుడే..

Young ISRO Scientist Life Story : చంద్రయాన్-3 మిషన్.. ఆ సాఫ్ట్‌వేర్ రూపకర్త తెలుగు యువకుడే..
Young ISRO Scientist Life Story

Chandrayaan-3 latest news(Telugu flash news) :

చంద్రయాన్-3.. గ్రాండ్ సక్సెస్. దేశ చరిత్రలో గొప్పమైలురాయిగా నిలిచిపోయే ఈ ప్రాజెక్టులో ఓ తెలుగు యువకుడు తన వంతు పాత్ర పోషించాడు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లికి చెందిన కుమ్మరి కృష్ణ చంద్రయాన్‌ – 3 మిషన్‌లో 2 పేలోడ్స్‌ (LHVC), (ILSA)కు డేటా ప్రాసెసింగ్‌ సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. చంద్రయాన్‌ -3 మిషన్‌ లో 6 నెలల పాటు పనిచేశారు.


చంద్రయాన్‌ – 3 అనేక కేంద్రాలు పనిచేశాయి. మిషన్‌లోని 2 పేలోడ్స్‌లో ఐదుగురు సభ్యులు పనిచేశారు. LHVC , ILSAకు కృష్ణ డేటా ప్రాసెసింగ్‌ అనాలసిస్‌ సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. LHVC అంటే హారిజాంటల్‌ వెలాసిటీని తెలుపుతుందని కృష్ణ వివరించారు. ILSA అంటే చంద్రుడిపై వచ్చే కంపనాలు గుర్తించి రికార్డు చేస్తుందని వెల్లడించారు.

ఉండవల్లికి చెందిన మద్దిలేటి, లక్ష్మీదేవి దంపతుల కూలి పనులు చేసుకుంటూ తమ కుమారుడు కృష్ణను చదవించారు. కృష్ణకు సోదరి శకుంతల ఉన్నారు. కృష్ణ టెన్త్ వరకు ఉండవల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. 2008లో టెన్త్ పూర్తైన తర్వాత తిరుపతిలో డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ ( DCME) చేశారు. ఈ-సెట్‌ రాసి హైదరాబాద్ లో 2011 – 2014 వరకు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు.


ఆ తర్వాత టెరా డేటా రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో మూడున్నర ఏళ్లు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఇస్రో సెంట్రలైజడ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు పరీక్ష రాసి జాతీయస్థాయిలో 4వ ర్యాంకు సాధించారు. 2018 జనవరిలో సైంటిస్ట్‌ లెవల్‌ ఉద్యోగం పొందారు. యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌ బెంగళూరులో విధులు నిర్వహిస్తున్నారు.

ఓ సెంటిస్టుగా ఎదిగిన కృష్ణ.. చిన్నతనంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐదేళ్ల ప్రాయంలో పోలియో బారినపడ్డారు. కాళ్ల నరాలు చచ్చుబడ్డాయి. నడవలేని స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో అయిజలోని ఆయుర్వేద వైద్యుడు రామేశ్వర్‌రెడ్డి వద్ద వైద్యం పొందారు. 10 ఏళ్లు వయస్సు వచ్చే సరికి లేచి తన పనులు చేసుకునిస్థితికి చేరుకున్నారు. దాదాపు 23 ఏళ్లపాటు ఆయుర్వేద మందులు వాడానని కృష్ణ తెలిపారు. తోకవడ్లతో చేసిన గంజి శరీరానికి పూసి గంట తర్వాత స్నానం చేస్తే నరాల్లో రక్తప్రసరణ జరిగి కండరాలు వదులు అయ్యేవని వివరించారు. ఇలా వైకల్యంతో ఇబ్బంది పడినా చదువులో టాప్ లోనే నిలిచి ఉన్నత స్థానానికి ఎదిగిన కృష్ణ యూత్ కు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×